భారతీ సంస్కృతి ప్రపంచ దేశాలకు పరిచయం

Mar 6,2024 00:55

ప్రజాశక్తి – భట్టిప్రోలు
భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచ దేశాలకు తెలియజేసే విధంగా మండలంలోని ఐలవరం జెడ్‌పి ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించారు. భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదంతో పాఠశాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఇంగ్లాండ్‌లోని సౌత్ బ్యాంకు యూనివర్సిటీలో జాగ్రఫీ బోధించే ఉపాధ్యాయురాలు ఎలిమి రాబెల్ జూమ్ ద్వారా వీక్షించారు. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు పాశ్చాత్య దేశాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. నిత్యం ఐలవరం ఉన్నత పాఠశాల విద్యార్థులతో స్కైప్ ద్వారా ఉత్తర, ప్రత్యుత్తరాలు చేపడుతూ ఉంటారు. విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించి మన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేందుకు ఐలవరం విద్యార్థులు సిద్ధం కావాలని సూచించారు. కార్యక్రమాలను ప్రపంచ దేశాలకు చాటి చెబుతున్న ఐలవరం ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయులు వచ్చారు హరికృష్ణ అభినందనీయులని తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎం మాచర్ల మోహనరావు పాల్గొన్నారు.

➡️