జనకవరం సొసైటీ పాలకవర్గ ప్రమాణం

Feb 8,2024 00:17

ప్రజాశక్తి – పంగులూరు
మండలంలోని జనకవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన పాలకవర్గం బుధవారం బాధ్యతలు స్వీకరించింది. సొసైటీ అధ్యక్షులుగా తలపనేని సుధాకరరావు, సభ్యులుగా కట్టా నాగేశ్వరరావు, బొల్లా పోలయ్య బాధ్యతలు తీసుకున్నారు. వీరికి సొసైటీ సీఈఒ నాగబోయిన లక్ష్మీదేవి బాధ్యతలు అప్పగించారు. కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ స్వయం హనుమంతరావు, వైసిపి గ్రామ అధ్యక్షులు బాచిన ఆంజనేయులు, నాయకులు గుడిపూడి రామారావు, సొసైటీ మాజీ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, నాగబోయిన తిరుపతయ్య, ముప్పలనేని శ్రీనివాసరావు, తలపనేని శ్రీనివాసరావు, బాచిన చందర్రావు, కో ఆప్షన్ సభ్యులు ఖాశింఖాన్‌, పెంట్యాల రాంబాబు, రాయిని శ్రీనివాసరావు, వైఎస్సార్ యూత్ నాయకులు రావూరి శ్రీనివాసరావు, బాచిన వినయ్ పాల్గొన్నారు.

➡️