ప్రజల ఆదరణ ఉత్సాహాన్నిస్తుంది

Jan 4,2024 00:06

ప్రజాశక్తి – అద్దంకి
నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి జనం వస్తున్న తీరు చూస్తుంటే ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉందని వైసిపి ఇన్చార్జ్ పాణెం అనిమిరెడ్డి అన్నారు. నాలుగు సార్లు గెలిచినా, కొండయినా, అనకొండయినా తగ్గేదే లేదని అననారు. దేనికీ భయపడనని చెప్పారు. అందరి మద్దతుతో అసెంబ్లీలో అడిగెడతానని అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద పింఛన్లు పంపిణీ చేశారు. 2024వరకు పరిస్థితి వేరని, రాబోయే ఐదేళ్లలో అద్దంకిలో మార్పు అంటే ఏంటో చూపిస్తామని అన్నారు. పట్టణంలో 4008మందికి రూ.కోటి 21లక్షలు నగదును పెన్షన్ రూపంలో ప్రతి నెల ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. వ్యక్తిగతంగా తాను మాటల మనిషిని కానని అన్నారు. చేతల ద్వారానే తనను తాను నిరూపించుకుంటానని అన్నారు. అందుకు మీ అందరి మద్దతు కావాలని కోరారు. తొలుత సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. సమావేశానికి వైస్ చైర్మన్ పద్మేష్ అధ్యక్షతన వహించారు. కార్యక్రమంలో చైర్ పర్సన్ ఎస్తేరమ్మ, వైస్ చైర్మన్ అనంతలక్ష్మి, కౌన్సిలర్స్ మేడగా రమణమ్మ, విజయలక్ష్మి, సుధీర్, బాలు కోటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, పూనూరి నరేంద్ర, నాగసూరి శ్రీనివాసరావు, గోపాల్‌రెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

➡️