ఐక్యతతో బిసిలకు రాజకీయ ప్రాధాన్యత

Dec 29,2023 23:25

ప్రజాశక్తి – పర్చూరు
బీసీలు ఐక్యతతో సమస్యల పరిష్కారంపై నిరంతరం బీసీ సంక్షేమ సంఘం పనిచేస్తుందని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు పేర్కొన్నారు. స్థానిక పంక్షన్‌ హాల్లో ఆ సంఘం జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయి వరకు సంఘ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. బీసీ కాలనీలో సమస్యలపై పోరాడాలని సూచనలు చేశారు. బీసీల్లో పటిష్టమైన నాయకత్వం ఉందన్నారు. భవిష్యత్ కార్యక్రమంపై సూచనలు చేశారు. జిల్లా అధ్యక్షుడు జువ్వా శివరాం ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో మండల కమిటీలు ఈపాటికే నియమించినట్లు తెలిపారు. గ్రామ స్థాయి వరకు కమిటీలను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. బీసీలకు తమ సంఘం ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీలకు తెలిసేలాగా కార్యచరణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అద్దంకి అధ్యక్షుడిగా చేబ్రోలు రవీంద్రచారికి నియామక పత్రాన్ని అందజేశారు. పర్చూరు నియోజకవర్గ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా బంకా మాధవరావు, కారుమంచి రామాంజనేయులుకు ఎంపిక పత్రాలను అందజేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు2గా శ్రీనివాసాచారిని నియమించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు1 జొన్నాదుల వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి బాపట్ల రవికుమార్, జిల్లా గౌరవ అధ్యక్షుడు మద్దిబోయిన తాతయ్య, న్యాయ సలహాదారుడు అంగలకుదురు నటరాజన్, జిల్లా కార్యదర్శి మారం రవికుమార్ పాల్గొన్నారు.
పంగులూరు : అద్దంకి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా పంగులూరు గ్రామానికి చెందిన చేబ్రోలు రవిచంద్రను ఎన్నుకున్నారు. బిసి సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు జువ్వ శివరాం ప్రసాద్ అధ్యక్షతన శుక్రవారం పర్చూరులో నిర్వహించిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు.

➡️