గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలి

Mar 15,2024 00:10

ప్రజాశక్తి -కారంచేడు
ఐసిడిఎస్ ఆధ్వర్యంలో మండలంలోని ఆదిపూడి గ్రామంలో అంగన్‌వాడి పౌష్టికాహార వక్షోత్సవాలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ హిమబిందు చెప్పారు. పోషణ పక్వాడ కార్యక్రమం గ్రామంలో నిర్వహించారు. గర్భిణీలకు రక్తహీనత గురించి వివరించారు. తృణ ధాన్యాలు గురించి, మునగాకు, ఆకుకూరలు, కూరగాయలు ప్రతి ఒక్కరూ తీసుకోవడం వలన పోషణ కలుగుతుందని వివరించారు. గర్భవతులు, బాలింతలకు టిహెచ్ఆర్ పంపిణీ చేశారు.


వేటపాలెం : పౌష్టికాహారం పట్ల అవగాహన కలిగి ఉండాలని ఎసిడిపిఓ ఎం సుచిత్ర తెలిపారు. 1వ అంగన్‌వాడీ సెంటర్లో గురువారం జరిగిన పోషణ పక్వాడ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఆరేళ్లలోపు పిల్లలకు ఎత్తు, బరువు తీసి లోప పోషణకు గురైన పిల్లల తల్లులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. రక్త హీనతతో వున్న గర్భవతులు, బలింతలకు తీసుకోవలసిన పౌష్టికాహారం గురుంచి వివరించారు. ఆరు నెలలు నిండిన పిల్లలకు తల్లి పాలతో పాటు తప్పనిసరిగా అనుబంధ పోషకాహారం ఇవ్వనున్నట్లు చెప్పారు. బాలామృతంతో వివిధ రకాల వంటలను తయారు చేసి తల్లులకు చూపించారు. కార్యక్రమంలో సూపెర్వైసర్ ఎస్ పుష్పవల్లి, కార్యకర్త భార్గవి, తల్లుల్లు పాల్గొన్నారు.


చీరాల : అంగన్‌వాడి కేంద్రాల్లో చిన్నారులకు బాలామృతం పౌష్టికాహారాన్ని అందిస్తుందని సూపర్వైజర్ బి కుముద్వతి అన్నారు. పౌష్టికాహార పక్షోత్సవాల్లో భాగంగా పట్టణంలోని జయింతిపేట, అరిటాకుల నగర్లో పౌష్టికాహార పక్షోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు అందించే చిరుధాన్యాల్లో ఎన్నో రకాల పోషక విలువలు ఉంటాయని అన్నారు. ఈసందర్భంగా అత్త కోడళ్ళు వంటల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆషా వర్కర్లు మనో రంజితం, అంగన్‌వాడీ కార్యకర్తలు డి విజయలక్ష్మి, కె అనిత, రేవతి, పి పెర్సీ, పి నిర్మల, కె రమాదేవి, ఎ ఇందిరమ్మ, జి ప్రవళిక, జ్యోతి పాల్గొన్నారు.

➡️