అంబేద్కర్ చిత్రపటం బహుకరణ

Feb 20,2024 00:05

ప్రజాశక్తి – వేమూరు
కొల్లూరు మండలం అనంతపురం గ్రామానికి చెందిన వైసిపి నాయకులు, కార్యకర్తలు వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి వరికుటి అశోక్ బాబును కూచిపూడిలోని ఆయన నివాసంలో కలిశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఆయనకు బహుకరించారు. అనంతవరం గ్రామం నుండి కార్యకర్తలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనను కలసి గ్రామంలోని సమస్యలు వివరించారు. తక్షణ పరిష్కార సమస్యలను త్వరితగతిన పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని భరోసా ఇచ్చారు. ఆయన వెంట సతీమణి లక్ష్మి, అశోక్ బాబు కుమారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

➡️