పాఠశాలలకు చిత్రపటాలు బహుకరణ

Jan 19,2024 23:48

ప్రజాశక్తి బాపట్ల
మండలంలోని ఆదర్శనగర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు జి భారతీదేవి సహకారంతో తొలి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబా పూలే, జ్యోతిబాపూలే చిత్రపటాలను మండలంలోని అన్ని పాఠశాలలకు బహుకరిస్తున్నట్లు యూటీఎఫ్ మండల కార్యదర్శి మద్దాల సురేష్ తెలిపారు. స్థానిక ఎంఆర్‌సి భవనం వద్ద భారతీదేవి సమకూర్చిన చిత్రపటాలను ఎంఈఓలు నిరంజన్, డి ప్రసాదరావు ద్వారా ఉపాధ్యాయులకు అందజేశారు. యూటీఎఫ్ స్వర్ణోత్సవాల సందర్భంగా విద్యార్థుల్లో సావిత్రిబాయి, జ్యోతిబాపూలే జీవిత విశేషాలను విద్యార్థులకు తెలియజేసేందుకు ఈ చిత్రపటాలను బహూకరిస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలు 80 వరకు ఉంటాయని, వాటన్నింటికీ చిత్రపటాలను అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు జె వినయ్ కుమార్, కోశాధికారి ఎం వెంకటేశ్వరరెడ్డి, యుటిఎఫ్ మండల అధ్యక్షులు వి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి డి నన్నూరయ్య, యుటిఎఫ్ సీనియర్‌ నాయకులు నూతలపాటి కోటేశ్వరరావు, వై భాస్కరరావు, జెవివి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్ర రామారావు పాల్గొన్నారు.

➡️