ఓటు విలువను గుర్తించండి

Mar 14,2024 23:53

ప్రజాశక్తి – బాపట్ల
ఓటు విలువను గుర్తించి రాజ్యాంగ లక్ష్యాల పరిరక్షణకు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు పిసి సాయిబాబు అన్నారు. ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక ఎన్జీఒ హోంలో ప్రజాస్వామ్యం, ఎన్నికలు, ఓటరు చైతన్యం అనే అంశంపై గురువారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ నాయకులు ఎరవేసే ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. కార్యదర్శి కోట వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఓటుకు డబ్బు మద్యం వంటి ప్రలోభాలు పెరిగిపోయాయని అన్నారు. నగదు రహిత ఓటుతోనే అడ్డుకట్ట వేయాలని అన్నారు. ఓటరు చైతన్యంపై ప్రచురించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ బండికళ్ల బాబురావు, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆట్ల బాలాజీరెడ్డి, డివి రమణయ్య, లింకన్, మారుతీరావు, శివశంకరరెడ్డి, మల్లికార్జునరెడ్డి, జి సుగంధరావు, దాసరి లక్ష్మి, నిర్మలమ్మ, మహాలక్ష్మి పాల్గొన్నారు.

➡️