సీఎం పర్యటనపై సమీక్ష

Apr 4,2024 00:24 ##ysrcp #Parchuru

ప్రజాశక్తి – పర్చూరు
సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా మాజీ ఎంపిపి కోటా హరిప్రసాద్ నివాసంలో వైసీపీ ఎంఎల్‌ఎ అభ్యర్థి యడం బాలాజీ, వైసిపి మాజీ ఇంచార్జి రావి రామనాధం బాబు నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 6, 7తేదీల్లో సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బస్సు యాత్ర పర్చూరు నియోజకవర్గంలో జరుగనున్న నేపధ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లను చర్చించారు. ఎండల తీవ్రత కారణంగా యాత్రకు వచ్చే ప్రజలకు సౌకర్యాల ఏర్పాట్లు చర్చించారు. కార్యక్రమంలో నాయకులు యద్దనపూడి హరిప్రసాద్, కోటా శ్రీనివాసరావు, నరిశెట్టి విపిన్ బాబు, కఠారి అప్పారావు, దాసరి వెంకట్రావ్, గాదె సురేష్, కొనకంచి సుబ్బారావు, లంకా శివ, ఆకుల హేమంత్ పాల్గొన్నారు.

➡️