సిద్ధం ఏర్పాట్లపై సమీక్ష

Mar 6,2024 01:03

ప్రజాశక్తి – పర్చూరు
సిద్దం సభ ఏర్పాట్లపై వైసిపి నియోజకవర్గ ఇన్‌చార్జి యడం బాలాజీ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 10న మేదరమెట్లలో జరిగే సిద్ధం బహిరంగ సభకు 20వేలపైగా జన సమీకరణ చేయాలని కార్యకర్తలను కోరారు. స్థానిక వైసిపి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో సంక్షేమ పథకాలన్ని ఇంటివద్దకే రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అమల్లో ఉన్న 33 సంక్షేమ పథకాలతో ఎస్సి, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలు ఎంతో లబ్ది పొందుతున్నారని అన్నారు. ఇలాంటి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్మోహన్‌రెడ్డిని మళ్ళీ సీఎం చేయాలని కోరారు. ఎన్నికల మ్యానిఫెస్టోను పవిత్ర గ్రంధంగా భావించే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నేరవేర్చారని అన్నారు. కార్యక్రమంలో కారంచేడు జెడ్పిటిసి యార్లగడ్డ రజని, ఎంపిపి నీరుకట్టు వాసుబాబు, పర్చూరు ఎంపిపి మేకా ఆనందకుమారి, వైస్ ఎంపిపి పాలేరు వీరయ్య, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ బాబుల్లా, కోటా హరిబాబు, పఠాన్ కాలేష, బండారు ప్రభాకర్, దండా చౌదరి, బండి నాగేంద్రం, గోరంట్ల శివకుమారి, తులసి నాగమణి, తులసి శివనాగేశ్వరరావు, గాజుల రమేష్, భాగ్యరావు, పేరం సుబ్బారావు, దాసరి వెంకటరావు, కంచెనపల్లి రమేష్, గాదె సురేష్, జంగా అనిల్, ఆకుల హేమంత్, కూరాకుల ఇస్సాకు, జూపూడి రోశయ్య, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

➡️