పారిశుధ్యంపై అవగాహన

Feb 2,2024 22:41

ప్రజాశక్తి – అద్దంకి
మండలంలో పారిశుధ్య నిర్వహణపై ఐటిసి బంగారు భవిష్యత్తు, సెర్చ్ న్జీఒ ఆధ్వర్యంలో స్థానిక మండల ఆఫీసు నందు అవగాహన నిర్వహించారు. సెర్చ్ సంస్థ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో తడి, పొడి, ప్రమాదకర వ్యర్ధాలపై అవగాహన కల్పించారు. పారిశుద్యం సక్రమంగా అములు చేయుట ద్వార గాలి, నీరు, భూమి కలుష్యం నివారణ చేయొచ్చని అన్నారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యం, ఆయస్సు పెరుగుతుందని తెలిపారు. ఎస్టిడబ్ల్యూపీసీలు నిర్వహణ, వ్యర్ధాల సేకరణ క్లాప్ మిత్రాల జీతాలు వినియోగం, రుసుము మొదలగు విషయాల్లో పాశుద్ధ్య సంఘం, సర్పంచులకు పూర్తి అవగాహన కల్పించారు. వ్యర్ధాలు సేకరించకపోవడం వల్ల డెంగ్యూ, టైఫాయిడ్, మొదలైన వ్యాధులు వస్తాయని, వ్యర్థాలు తగలపెట్టుట వల్ల కాలుష్యం పెరిగి మానవుల జీవనానికి ప్రమాదంగా ఉన్నాయని అన్నారు. వ్యర్ధాలను సేకరణ కేంద్రాల్లో తడి వ్యర్ధాలను ఎరువుగా, పొడి వ్యర్ధాలను రీసైకిలింగ్ యూజ్ చెయ్యవలసిన అవసరం ఉందని తేలిపారు. దీనిలో గ్రామ సర్పంచులు, కార్యదర్శులు, క్లాప్ మిత్రులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎంపీడీఒ సత్యనారాయణ మట్లాడుతూ గ్రామాల్లో కార్యక్రమంపై అవగాహన పెంచుకొని ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. ఈఓ అండ్ పిఅర్డి హనుమంతరావు మట్లాడుతూ గ్రామంలో వ్యర్ధాల నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని చెప్పారు. వ్యాధులు బారిన పడకుండా ప్రజలను కాపాడాలని కోరారు. ప్రతి కేంద్రాల్లో వ్యర్ధాల ద్వారా ఎరువులు తయారు చేయాలని, గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో ట్రైనర్స్ బొల్లయ్య, ప్రదీప్, ఏసోబు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

➡️