సైన్స్‌ నిజానికి నిదర్శనం : శ్రీ గౌతమీ విద్యాసంస్థల అధినేత ఎం వెంకటేశ్వర్లు

Mar 4,2024 00:23

ప్రజాశక్తి – చీరాల
సైన్స్ నిత్య జీవితానికి నిదర్శనమని శ్రీ గౌతమీ విద్యా సంస్థల అధినేత ఎం వెంకటేశ్వర్లు (ఎం) పేర్కొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా స్థానిక రాఘవేంద్ర పబ్లిక్ స్కూల్‌లో వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి (అప్ కాస్ట్) బాపట్ల జిల్లా కో ఆర్డినేటర్ పవని భానుచంద్రమూర్తితో కలిసి ఆయన ప్రారంభించారు. విద్యార్థులు ప్రజలకు ఉపయోగకరమైన ప్రయోగాలు చేయడం అభినందనీయమని అన్నారు. దేశంలో ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారని అన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. వచ్చే ఏడాది మరిన్ని కొత్త ఆలోచనలు, ప్రయోగాలతో సిద్దం కావాలని అన్నారు. విద్యార్థుల ప్రతిభ, మేథాశక్తిని అభినందించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలను పరిశీలించి వాటి ఉపయోగాలను అడిగి తెలుసుకున్నారు. విద్యా ర్థుల నిశిత పరిశీలన, ప్రయోగాలపై ఆసక్తిని పెంపొందించు కోవాలని అన్నారు. సైన్స్‌ అభివృద్ధితోనే దేశాభివృద్ధి ఆధారపడి ఉందని అన్నారు. విద్యార్థి దశ నుంచే శాస్త్రీయ దృక్పథం అలవర్చేందుకు సైన్స్ పోటీలు నిర్వహిస్తునట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ గవిని మణికుమార్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️