ప్రజల్లో శాస్త్రీయ ఆలోచన పెంచాలి

Nov 23,2023 00:30

ప్రజాశక్తి – బాపట్ల రూరల్
సైన్సు, సామాజిక శాస్త్రాలు మేళవింపు అవసరమని జెవివి రాష్ట్ర నాయకులు కోట వెంకటేశ్వరరెడ్డి అన్నారు. ప్రజల్లో ఊరూరా శాస్త్రీయ ఆలోచన పెంచాలని కోరారు. జెవివి సాంస్కృతిక విభాగం, ఘంటసాల చైతన్య వేదిక, ఝాన్సీ రాణి కళావేదిక, ప్రజాస్వామ్య ఐక్య వేదిక, సోదర సంఘాల ఆధ్వర్యంలో చైతన్య భవన్‌లో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జెవివి ఒక ప్రజాసైన్స్ ఉద్యమ సంస్థగా దేశవ్యాప్తంగా నవంబర్ నుండి 2024 ఫిబ్రవరి వరకు ప్రచార ఉద్యమం చేపట్టిందని అన్నారు. సీనియర్ సిటిజన్స్ సంఘ అధ్యక్షులు గాదె హరిహరరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటరు చైతన్యం గురించి వివరించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక అధ్యక్షులు ఆట్ల బాలాజీరెడ్డి భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ గురించి చెప్పారు. మహిళా కన్వీనర్ ఏ కళ్యాణి ప్రచార ఉద్యమం గురించి వివరించారు. అభ్యుదయ భావాల వేదిక నాయకులు జీవశాస్త్రం, చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతాలపై మాట్లాడారు. సమావేశంలో జి రాజారావు, బి విల్సన్, డి నిర్మలమ్మ, దాసరి లక్ష్మి, పి లక్ష్మి, నూరు బాషా శ్రీనివాస్, ఎస్‌కె సుభాని, ఇస్రాయిల్, శరత్ బాబు పాల్గొన్నారు.

➡️