కరాటే పోటీల్లో వివేక విద్యార్థుల ప్రతిభ

Mar 4,2024 00:10

ప్రజాశక్తి – వేటపాలెం
చిలకలూరిపేటలోని వాసవి గార్డెన్ మోడరన్ షాపింగ్ మాల్ నందు ఆదివారం నిర్వహించిన కరాటే పోటీల్లో వివేక స్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. షొటోకాన్ కరాటే ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొన్నట్లు కరాటే మాస్టర్ కావూరు నరేందర్ రెడ్డి తెలిపారు. కటాస్ విభాగంలో 6వ తరగతి విద్యార్ధిని ఎస్ తేజస్విని, పటాస్ వైట్ బెల్ట్ విభాగంలో 5వ తరగతి విద్యర్ధి సిహెచ్ హరీష్ బంగారు పతకాలు సాధించారు. జూనియర్స్ విభాగంలో యూకేజీ పి మణికంఠ వెండి పధకం సాధించినట్లు తెలిపారు.

➡️