వైసిపి పాలనలోనే సంక్షేమం

Mar 6,2024 00:10

ప్రజాశక్తి – నిజాంపట్నం
వైసిపి పాలనలోనే సంక్షేమ పధకాలు లబ్దిదారుల ఇళ్లకు చేరాయని, రానున్న ఎన్నికల్లో వైసిపిని మరోసారి ఆదరించాలని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు, వైసిపి ఇన్‌ఛార్జి ఈపూరు గణేష్‌ కోరారు. ఈనెల 10న జరగనున్న సిద్ధం సభకు హాజరు కావాలని కోరారు. బూత్ కన్వీనర్లు, కార్యకర్తలు, వాలంటీర్లతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సంక్షేమ పధకాలు అమలు చేస్తున్న జగన్‌ను మరోసారి గెలిపించుకోవాలని కోరారు. గత ప్రభుత్వంలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తానని చేయలేదని అన్నారు. కార్యక్రమంలో జిడిసిసి డైరెక్టర్ నల్లపాటి రామయ్య, నిజాంపట్నం సోసైటీ ప్రెసిడెంట్ మరకా శ్రీనివాసరావు, ప్రసాదం వాసుదేవా, వైసిపి నాయకులు మదన్మోహన్ పాల్గొన్నారు.

➡️