వైసిపీకి నూకలు చెల్లాయి

Dec 29,2023 23:42

ప్రజాశక్తి – బాపట్ల
రాష్ట్రంలో వైసీపీకి నూకలు చెల్లాయని టిడిపి ఇన్‌ఛార్జి నరేంద్ర వర్మ అన్నారు. పట్టణంలోని దేవుడి మాన్యం, మండలంలో మూలపాలెంలో ఇంటింటికి టిడిపి, మీ మాటే – నా బాట, భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం నిర్వహించారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వైసీపీ అరాచక పాలనకు రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు సిఎం అయితేనే సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు.

➡️