కేడర్‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటా :బత్యాల చెంగల్రాయుడు

‘ప్రజాశక్తి-రైల్వేకోడూరు కేడర్‌ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు పేర్కొన్నారు. రైల్వేకోడూరు పట్టణంలో శుక్రవారం బత్యాల అనుచరులతో వెంకయ్య స్వామి గుడి వద్ద నుంచి లక్ష్మీ ప్యారడైజ్‌ థియేటర్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు నాయుడు రాజంపేట అసెంబ్లీ టికెట్‌ను బత్యాలకే కేటాయించి మా భవిష్యత్తుకు భరోసా కల్పించాలంటూ బత్యాల అనుచరులు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు ఇప్పటికైనా మనసు మార్చుకుని బత్యాలకు టికెట్‌ ఇవ్వాలంటూ కార్యకర్తలు నినాదాలు చేస్తూ టిడిపి జెండాలతో సంఘీభావంగా ర్యాలీ నిర్వహించారు. శ్రీలక్ష్మి ప్యారడైజ్‌ థియేటర్‌ వద్ద కార్యకర్తలందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేశారు.అనంతరం ఆయన నివాసంలో బత్యాల విలేకరులతో మాట్లాడుతూ 2019 ఎన్నికలలో రాజంపేట అసెంబ్లీ స్థానానికి తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ చంద్ర బాబు నాయుడు పోటీ చేయించారని, ఓటమి చెందినా కూడా గత ఐదేళ్లకు పైగా భార్యా పిల్లలను, వత్తిని ,ప్రవత్తిని,వదిలి రాజంపేటకు వెళ్లి పార్టీ కోసమే కేడర్‌తో కలిసి అహర్నిశలు కషి చేశానని అన్నారు. సర్వే రిపోర్టు కూడా తనకు సనుకూలంగా వచ్చిందని రాబోయే ఎన్నికలలో కూడా తనకే టికెట్టు ఇస్తున్నానని ప్రచారం చేసుకోమని చంద్రబాబు చెప్పి గత శుక్రవారం సుగవాసి బాలసుబ్రమణ్యానికి టికెట్‌ కేటాయించడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యానని అన్నారు. గత ఎన్నికలలో తాను స్థానికేతరుడని, రాజంపేటలో ఒక ఇల్లు కూడా కొనుగోలు చేసి కార్యాలయం ఏర్పాటు చేశానని తన కుటుంబ సభ్యుల ఓట్లు కూడా రాజంపేటలోనే ఉన్నాయని అన్నారు. ఈ ఎన్నికలలో స్థానికుడనని ఇప్పటికైనా చంద్రబాబు మనసు మార్చుకొని తనకు టికెట్‌ ఇవ్వకపోతే కేడర్‌ తీసుకునే నిర్ణయమే శిరోధార్యం అని అన్నారు.బత్యాల’

➡️