ఉచిత వేసవి శిక్షణ తరగతులతో మేలు

Apr 27,2024 21:16

 ప్రజాశక్తి- బొబ్బిలి : పదో తరగతి విద్యార్థులు కోసం నిర్వహిస్తున్న ఉచిత వేసవి తరగతులతో ఎంతో మేలు జరుగుతోందని, ఈ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు కె.విజయగౌరి కోరారు. స్థానిక వాసు జూనియర్‌ కళాశాలలో శనివారం గ్రీన్‌ బెల్ట్‌ సొసైటీ, యుటిఎఫ్‌, మాజీ సైనిక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో టెన్త్‌ విద్యార్థులకు ఉచిత వేసవి శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టెన్త్‌ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు శిక్షణ తరగతులు దోహదం చేస్తాయన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని నిర్వాహకులు చెప్పారు. కార్యక్రమంలో గ్రీన్‌ బెల్ట్‌ సొసైటీ అద్యక్షులు ఎస్‌వి రమణమూర్తి, యుటిఎఫ్‌ నాయకులు ప్రసన్నకుమార్‌, పి.సత్యనారాయణ, మాజీ సైనిక ఉద్యోగుల సంఘం నాయకులు శర్మ, తదితరులు పాల్గొన్నారు.

➡️