ఆశీర్వదించండి..అభివృద్ధిచేస్తా

Apr 22,2024 22:34

 ప్రజాశక్తి – పూసపాటిరేగ : ఆశీర్వదిస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని ఎన్‌డిఎ కూటమి అభ్యర్ధి లోకం మాధవి అన్నారు. సోమవారం మండలంలోని పూసపాటిపాలెం, కొప్పెర్ల, నడిపల్లి గ్రామాల్లో టిడిపి నేతలతో కలసి జన విజయ యాత్రలో భాగంగా ఇంటింటా ప్రచారం చేశారు. పూసపాటిపాలెం చెరువులో మహిళలతో మాట్లాడారు. ప్రచారంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మహంతి చిన్నంనాయుడు, టిడిపి మండల అధ్యక్షలు మహంతి శంకరావు, ఆకిరి ప్రసాదరావు, దంతులూరి సూర్యనారాయణరాజు, పిన్నింటి సన్యాసినాయుడు, ఐటివి శ్రీనువాసరావు, జిల్లా సర్పంచులు సంఘం అధ్యక్షలు రౌతు స్వామినాయుడు, జనసేన మండల అధ్యక్షలు జలపారి శివ, పతివాడ శ్రీను, పాల్గొన్నారు.

➡️