ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం : బూచేపల్లి

ప్రజాశక్తి-దర్శి : ఆర్యవైశ్యులకు సముచిత స్థానము కల్పించి అండగా ఉంటామని వైసిపి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. స్థాణిక శ్రీనివాస పద్మావతి కల్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు వల్ల భాస్కర్‌ అధ్యక్షతన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు అన్ని విధాల అండగా ఉంటామన్నారు. అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటామని తెలిపారు. రేషన్‌ డీలర్ల నియామకంలో ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో దర్శి ఎమ్మెల్యేగా తనను, వైసిపి ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని గెలిపించాలన్నారు. ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర చైర్మన్‌ కుప్పం ప్రసాద్‌ మాట్లాడుతూ వైసిపితోనే ఆర్యవైశ్యులకు అన్ని విధాల న్యాయం జరుగుతుందన్నారు. చంద్రబాబునాయుడు కల్లబొల్లి మాటలు చెప్పడం తప్ప ఆర్యవైశ్యులకు చేసింది ఏమి చేయలేదన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో దర్శి ఎమ్మెల్యేగా శివప్రసాద్‌రెడ్డి గెలిపించాలన్నారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు దేవకి వెంకటేశ్వర్లు, యువజన నాయకులు హరీష్‌, ఆర్యవైశ్య సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు సూరే చిన్నసుబ్బారావు మాట్లాడారు. అనంతరం బూచేపల్లి కుటుంబ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, బూచేపల్లి నందిని , వైసిపి పట్టణ అధ్యక్షుడు సురేష్‌, సుబ్బారావు, ఆర్యవైశ్య సంఘం నాయకులు మునగా ఆంజనేయులు, మునగా నాగేశ్వరరావు, పానుగంటి కోటేశ్వరరావు, రజిని, ఇందిరా, సుజాత, కుసుమ తదితరులు పాల్గొన్నారు. 6వ వార్డులో ఇంటింటి ప్రచారం…దర్శి పట్టణంలోని 6వ వార్డులో వైసిపి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరగాలంటే జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు. అనంతరం ముండ్లమూరు మండలం రావిపాడు, తమ్మలూరు, కొమ్మారం, బొప్పిడివారిపాలెం, అయోధ్యనగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తాళ్లూరు మండలం తూర్పుగంగవరం గ్రామానికి పలువురు వైసిపిలో వచ్చారు. శివప్రసాద్‌ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్‌ వెన్నపూస నారాయణమ్మ, నారాయణరెడ్డి, వైసిపి పట్టణ అధ్యక్షుడు కట్టేకోటి హరీష్‌, వైసిపి మండల అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్‌ డైరెక్టర్లు కుమ్మిత అంజిరెడ్డి, స్థానికొమ్ము తిరుపతిరెడ్డి, నాయకులు కెవి.రెడ్డి, సద్ది పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️