ఘనంగా బూచేపల్లి జన్మదిన వేడుకలు

ప్రజాశక్తి-దర్శి : వైసిపి దర్శి నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం నిర్వహించారు. దర్శిలోని బూచేపల్లి గృహంలో అభిమానులు భారీ కేక్‌ కట్‌ చేశారు. శాలువాలతో బూచేపల్లిని సత్కరించారు. చలివేంద్ర వద్ద కొండమీద వెలసియున్న శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రి మేరు నాగార్జున, వైసిపి ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బూచేపల్లిని ఘనంగా సన్మానించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గొల్లపాటి సుధారాణి, అచ్చయ్య, ఉషా, మురళి, సుంకర, సునీత, బ్రహ్మానందరెడ్డి, వైసిపి మండల అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి, తూము సుబ్బారెడ్డి, బిజ్జం సుబ్బారెడ్డి, ఎఎంసి చైర్మన్‌ బుజ్జి, జడ్‌పిటిసిలు మార వెంకటరెడ్డి, నాగిరెడ్డి, రత్నం, రాజు, రాష్ట్ర కార్పొరేషన్‌ డైరెక్టర్లు కుమ్మిత అంజిరెడ్డి, డాక్టర్‌ ఎస్‌ఎం.బాషా, సానికొమ్ము తిరుపతిరెడ్డి, జెసిఎస్‌ మండల కన్వీనర్లు బత్తిని వెంకటేశ్వర్లు, కోటిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపిపిలు పోశం మధుసూదన్‌రెడ్డి, ఇత్తడి దేవదానం, గొల్లపాటి మోషే, వీరగంధం కోటయ్య, మేరువ సుబ్బారెడ్డి, రాష్ట్ర సాంస్కతిక విభాగం డైరెక్టర్‌ షేక్‌ సైదా తదితరులు పాల్గొన్నారు. చీమకుర్తి : దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి పుట్టినరోజు వేడుకలను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వైసిపి కార్యాలయంలో మంత్రి మేరుగ నాగార్జున కేక్‌ కట్‌ చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి వేమా శ్రీనివాసరావు, వైసిపి మండల అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు, సంతనూలపాడు జడ్‌పిటిసి దుంపా రమణమ్మ, దుంపా చెంచిరెడ్డి, వైసిపి పట్టణ అధ్యక్షుడు కె. శేఖరరెడ్డి, యూత్‌ అధ్యక్షుడు మొగిలిశెట్టి వెంకటేశ్వర్లు, నాయకులు చిన్నపురెడ్డి మస్తాన్‌రెడ్డి, చిన్నపురెడ్డి వెంకటరెడ్డి, మంచా హరికృష్ణ, కౌన్సిలర్లు సోమా శేషాద్రి, గోపురపు చంద్ర, పత్తి కోటేశ్వరరావు,తప్పెట బాబూరావు పాల్గొన్నారు.

➡️