సంపన్నుడిగా పుట్టి.. సామాన్యుల కోసం పోరాడి..

May 19,2024 23:06

ప్రజాశక్తి – సత్తెనపల్లి : సంపన్నుల కుటుంబంలో పుట్టినా కడవరకూ పేదల కోసం పోరాడిన కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య అని వక్తలు కొనియాడారు. సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఆయన చిత్రపటాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. ఎర్రజెండాలను ఆవిష్కరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను సుందరయ్య స్ఫూర్తితో పోరాడి తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.స్థానిక పుతుంబాక భవన్‌లో పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సభ కె.శివదుర్గారావు అధ్యక్షత నిర్వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు గద్దె చలమయ్య మాట్లాడారు. మతోన్మాదం దేశానికి చాలా ప్రమాదకరమని అప్పుడే సుందరయ్య చెప్పారని, బిజెపి అనుసరిస్తున్న మతోన్మాద, నియంతృత్వ విధానాలను సుందరయ్య స్ఫూర్తితో తిప్పికొ ట్టాలని పిలుపునిచ్చారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు చేయాలని, తెలుగువారంతా ఒక రాష్ట్రంగా ఉండాలని ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’అని పుస్తకం రాశారని తెలిపారు. ఆంధ్రరాష్ట్రంలోని నీటి సరఫరాపై ‘ఆంధ్రప్ర దేశ్‌లో సమగ్ర నీటి పథకం’ పుస్తకం రాశారని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరా టంలో ప్రత్యక్షంగా పాల్గొని భూమిలేని పేదల కు భూ పంపిణీ చేశారని అన్నారు. సుందరయ్య చూపిన బాటలో మనమంతా పయనించడమే ఆయనకు అర్పించే నివాళి అప్నారు. ప్రముఖ న్యాయవాది పిన్నమనేని పాములయ్య మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలు, కార్మిక, కర్షకుల కోసం సుందరయ్య అనేక ఉద్యమాలను నడిపారని అన్నారు. ఆయన స్ఫూర్తికి భిన్నంగా నేటి పాలకులు ప్రజాస్వామ్య విలువలను నిర్వీర్యం చేసి డబ్బు రాజకీయాలను తెచ్చారని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడి చేస్తున్నారని, ఈ వినాశకర విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. తొలుత సుందరయ్య చిత్రపటానికి పూలమా లలేసి నివాళులర్పించారు. నాయకులు పి.సూ ర్యప్రకాశరావు, జి.ఉమశ్రీ, జి.రజిని, ఐ.అరుణ, జె.రాజకుమార్‌, పి.ప్రభాకర్‌, జి.సుసులోవ్‌, ఎం.హరిపోతురాజు పాల్గొన్నారు.

ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : నిరాడంబర జీవితాన్ని గడిపిన సుందరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని సిపిఎం సీనియర్‌ నాయకులు షేక్‌ హుస్సేన్‌షా అన్నారు. మండలంలోని ఫణిదంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ప్రజాశక్తి – వినుకొండ : శావల్యాపురం మండల కేంద్రంలో నిర్వహించిన వర్ధంతి సభలో చిత్రపటానికి సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌ పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుందరయ్య ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సిపిఎం మండల కార్యదర్శి కె.వి.ఆర్‌ మోహన్‌ చందు, బి.వెంకటరాయుడు, జి.వెంకటేశ్వర్లు, డి.చిన్న వెంకయ్య, ఎస్‌.గోవిందు, పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. వినుకొండ మండలం విఠంరా జుపల్లిలో టి.వెంకటేశ్వర్లు అధ్యక్షతన సభ నిర్వహించారు. సుందరయ్య చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. పట్టణం లోని సుందరయ్య నగర్‌లో ఎం.రామకృష్ణ అధ్యక్షతన సభ నిర్వహించారు. ఎర్రజెండాను సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు ఆవిష్క రించారు. జిల్లా నాయకులు కె.హనుమంతరెడ్డి మాట్లాడారు. నవీన్‌ కుమార్‌, నాగేంద్ర మాస్టర్‌, వెంకటప్పయ్య, షేక్‌ మదార్‌వలి పాల్గొన్నారు.

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : స్థానిక ప్రజాశక్తి నగర్‌ కన్నెగంటి హనుమంతు భవనంలో టంటం సుబ్బయ్య అధ్యక్షతన వర్ధంతి సభ నిర్వహించారు. సుందరయ్య చిత్రపటానికి సుబ్బయ్య పూలమాలేసి నివాళులర్పించారు. సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శిశర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు మాట్లాడుతూ భూస్వామ్య కుటుంబంలో పుట్టి పేదల కోసం సుందరయ్య పోరాడారని, జైలు శిక్ష, అజ్ఞాతవాసాన్నీ గడిపారని చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారని, ధరలు పెరిగిన సందర్భంలో నిత్యావసర సరుకులు పేదలకు తక్కువ ధరలకు అందించారని చెప్పారు. తన కుటుంబం, తన గ్రామం నుండే పోరాటాన్ని ప్రారంభించారని, వ్యవసాయ కార్మికులను కూడగట్టి వారి సమస్యలపై పోరాడారని తెలిపారు. సుందరయ్య ఆశయ సాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. నాయకులు టి.శ్రీనివాసరావు, బి.నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, డి.భూలక్ష్మి, జి.రమణ, డి.వెంకటేశ్వర్లు, హుస్సేన, ఎన్‌.వెంకటేశ్వర్లు, కోటిరెడ్డి, జి.కోటేశ్వరరావు, మస్తాన్‌, సోమ ప్రసాద్‌ పాల్గొన్నారు.

ప్రజాశక్తి – చిలకలూరిపేట : సుందరయ్య తిరిగిన గడ్డ చిలకలూరిపేట అని సిపిఎం నాయకులు ఎస్‌.లూథర్‌ అన్నారు. స్థానిక తూర్పు మాలపల్లెలో వర్ధంతి సభతోపాటు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లూథర్‌ మాట్లాడుతూ 1950-55 కాలంలో పలు పొగాకు కంపెనీల్లో పని చేస్తున్న మహిళా కార్మికులు పోరాడారని, ఈ పోరాటాన్ని ఆరుగురు మహిళలు ప్రారంభించారని గుర్తు చేశారు. ఆ పోరాటం సందర్భంగా సాధించుకున్న హక్కులను వివరించి అది ఈ ప్రాంతానికే వన్నె తెచ్చిందని చెప్పారు. పేదల కోసం ఉద్యమిస్తూ 17 మంది ప్రాణాలు కోల్పోయారని వారికి నివాళులర్పించారు. సిపిఎం పట్టణ కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు, నాయకులు కె.రోశయ్య, టి.ప్రతాపరెడ్డి మాట్లాడుతూ సుందరయ్యను ఆదర్శంగా తీసుకుని ప్రజా సమస్యలపై పోరాడాలన్నారు. స్థానిక ఎన్‌ఆర్‌టి సెంటర్‌ సమీపంలో జెండాను సిపిఎం నాయకులు ఎస్‌.బాబు, పాటిమీద ప్రాంతంలో జెండాను పి.సామ్రాజ్యమ్మ ఎర్రజెండాలను ఆవిష్కరించారు. సుందరయ్య చిత్రపటాలకు పి.ఈశ్వరమ్మ, పి.రాములు, జి.సుబ్బయ్యల పూలమాలలేశారు. మానుకొండ వారిపాలెంలో గోవిందరెడ్డి స్తూపం వద్ద టి.ప్రతాపరెడ్డి జెండాను ఆవిష్కరించగా సిపిఎం పట్టణ కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఎస్‌.లూథర్‌, ఎం.విల్సన్‌ పాల్గొన్నారు.

ప్రజాశక్తి – క్రోసూరు : మండలంలోని 88 త్యాళ్లూరు మృత వీరుల స్మారక స్థూపం వద్ద పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.రవిబాబు పూలమాలలేసి నివాళులర్పించి మాట్లాడారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను సుందరయ్య స్ఫూర్తితో తిప్పికొట్టేందుకు ఐక్యంగా పోరాడాలన్నారు. సీనియర్‌ నాయకులు ఎ.ఆంజనేయులు మాట్లాడుతూ దున్నేవాడి చేతిలో భూమి ఉండాలని సుందరయ్య పోరాడారని, సత్తెనపల్లి తాలూకా పరిధిలో ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలోనే 17 మంది ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేశారు. ఆవరి అమరత్వానికి చిహ్నంగా 88 త్యాళ్లూరులో స్తూపం నిర్మించగా సుందరయ్య 1950లో ప్రారంభించారని తెలిపారు. రైతు ఉద్యమానికి అండగా నిలిచిన కమ్యూనిస్టు నాయకులు డి.గురవరాజు విగ్రహానికి సీనియర్‌ నాయకులు ఎ.బాలయ్య పూలమాల వేశారు. సిపిఎం మండల కార్యదర్శి టి.హనుమంతరావు, నాయకులు వి.వెంకటేశ్వర్లు, వి.వెంకటప్పారావు, బిక్షాలు, జి.చిన్నప్ప, జి.మహేష్‌, ముస్తఫా, పి.రాజు పాల్గొన్నారు.ప్రజాశక్తి – నకరికల్లు : మండలంలోని చేజర్లలో సుందరయ్య చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. సిపిఎం మండల కార్యదర్శి జి.పిచ్చారావు మాట్లాడారు. ఇ.అప్పిరెడ్డి, సిహెచ్‌.కోటేశ్వరరావు, బాలమ్మ, కుమారి, దుర్గాబాయి, రామాంజి నాయక్‌, జి.కొండలు పాల్గొన్నారు.

ప్రజాశక్తి-మాచర్ల : స్థానిక సిపిఎం కార్యాలయంలో సుందరయ్య చిత్రపటానికి నాయకులు పూలమాలలేసి నివాళులు అర్పించారు. సుందరయ్య ఆశయాలను ముందుకు వెళ్లేందుకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మరింతగా ఉద్యమించాలన్నారు. వి.వెంకట్రావు, బి.మహేష్‌, వై.సురేష్‌, కె.వెంకటరత్నం, ఎం.శోభన్‌ కుమార్‌, బి.శ్రీను, బి.శీను పాల్గొన్నారు.

ప్రజాశక్తి-ముప్పాళ్ల : మండలంలోని మాదల సిపిఎం కార్యాలయంలో వర్ధంతి సభ నిర్వహించారు. తొలుత సుందరయ్య చిత్రపటానికి సిపిఎం సీనియర్‌ నాయకులు పూలమాలలు వేసే నివాళులర్పించారు. నాయకులు కె.సాంబశివరావు, ఎం.వెంకటరెడ్డి మాట్లాడారు. జి.జాలయ్య, పి.సైదాఖాన్‌, కె.నాగేశ్వరరావు, ఐ.వెంకటరెడ్డి, ఐ.సత్యనారాయణరెడ్డి, టి.బ్రహ్మయ్య పాల్గొన్నారు.

➡️