చదువుకున్న పాఠశాలకు మంచి పేరు తీసుకురండి : డిప్యూటీ డీఈఓ కృష్ణమూర్తి

Apr 2,2024 16:02 #High School, #Manyam District

ప్రజాశక్తి-పాలకొండ(మన్యం): విద్యార్థులు బాగా చదువుకొని చదువకున్న పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని డిప్యూటీ డీఈఓ పర్రి కృష్ణమూర్తి సూచించారు. వెంకం ఎంపీయూపీ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మండలంలోని ఉన్నత పాఠశాలల్లో వెంకంపేట ఎంపీయూపీ పాఠశాల అభివృద్ధి విషయంలో రోజురోజుకు ముందుకు వెళ్తుందన్నారు. ఎంఈఓ`2 సోంబాబు మాట్లాడుతూ పాఠశాలకు మంచి పేరు రావాలంటే ఉత్తమ విద్యా బోధనతో పాటు పరిసరాలు, విద్యార్థులపై వారి తల్లిదండ్రుల శ్రద్ధ కూడా ఎంతో అవసరం. ఈ మూడు విషయాలు ఈ పాఠశాలలో ఉన్నాయని అన్నారు. మారుమూల ఉన్న ఈ పాఠశాలలో 200 మందికి పైగా విద్యార్థులున్నారంటే ఇక్కడ ఉపాధ్యాయులు కృషేనని అన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఈఓ, ఎంఈఓలను పాఠశాల హెచ్‌ఎం జి.పరాంకుశంనాయుడు, ఇతర ఉపాధ్యాయులు దుశ్సాలువాలతో సత్కరించి మెమోంటాలు అందించారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ యూనియన్‌ ప్రతినిధులు హేమని కుమార్‌, కొత్తకోట నాగేశ్వరరావు, శాసపు వాసుదేవరవాఉ, ఓని పాఠశాల హెచ్‌ఎం, పాఠశాల ఉపాధ్యాయులు బి.ఉదయ్‌బాబు, వి.నాగామణి, వై.మల్లేశ్వరరావు, సీహెచ్‌ కమలకుమారి, డి.గౌతమి, ఎస్‌.గోపి, జి.లక్ష్మీకుమారి, కోరాడ రమాకుమారి, ఎంఆర్సీ సిబ్బంది లక్ష్మణ, భాను, వీవర్స్‌కాలనీ సచివాయల సిబ్బంది, పేరెంట్స్‌ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️