బుద్ధుని బోధనలు అనుసరణీయం

దిబ్బిడిలో బుద్ధని విగ్రహానికి నివాళులర్పిస్తున్న శ్రీనివాసరావు తదితరులు

ప్రజాశక్తి -గాజువాక

మానవాళి మనుగడకు బుద్ధుని బోధనలు ఎంతో అవసరమని 72వ వార్డు కార్పొరేటర్‌ ఎజె స్టాలిన్‌ అన్నారు. చైతన్యనగర్‌లోని గౌతమ బుద్ధ గ్రంథాలయంలో బుద్ధుని జయంతిని గురువారం నిర్వహించారు. స్టాలిన్‌ ముఖ్య అతిథిగా హాజరై బుద్ధుని విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, శాంతి, సామరస్యానికి ప్రతీక బుద్ధుని బోధనలు అన్నారు. అనంతరం గౌతమ బుద్ధ గ్రంథాలయ నిర్వాహకులు ఎస్‌వి.సుబ్బారావును సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ నిర్వాహకులు జాలాది వెంకటేశ్వరరావు, బాపయ్య, బుచ్చయ్య చౌదరి, వరిష్ట పౌరుల సమాఖ్య ప్రతినిధి రమణ రాజు, సిపిఐ నాయకులు కర్రి వెంకటేశ్వరరావు, సలీం, రామారావు, అప్పారి దానయ్య, శ్రీలక్ష్మి పాల్గొన్నారు.కొత్తకోట:రావికమతం మండలంలో కొత్తకోట అంబేద్కర్‌ కాలనీ -1లో బుద్ధ పౌర్ణమి వేడు కలు గురువారం ఘనంగా నిర్వహించారు. దళిత బహుజన సంక్షేమ సమాజం విశాఖ ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ మల్లేటి రాజు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్బంగా రాజు మాట్లాడుతూ, బుద్దిని భోదనలు సమాజానకి అవసరమన్నారు. బుద్ధని విగ్రహం స్థాపనకు కొత్తకోట గ్రామంలో సర్వే నెం 241/1 లో ప్రభుత్వ భూమిని కేటాయిస్తామన్న హామీని అధికారులు నిలబెట్టు కోవాలని డిమాండ్‌ చేశారు.ముందుగా స్థానిక అంబేద్కర్‌ కాలనీ సామాజిక భవనంలో బుద్దుని విగ్రహనికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు..ఈ కార్యక్రమంలో అంబేద్కర్‌ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు… బుచ్చయ్యపేట : మండలంలోని దిబ్బిడి గ్రామంలో బుద్ధ పౌర్ణమి వేడుకలు గురువారం నిర్వహించారు. ముందుగా బుద్ధుని విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ గొన్నాబత్తుల శ్రీనివాసరావు మాట్లాడుతూ బుద్ధుని బోధనలు సమాజానికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. శాంతి సహనంతో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ముమ్మిన నాగరాజు, మండల తెలుగు యువత అధ్యక్షులు సానాపతి మణికంఠ, గంట సన్యాసి నాయుడు, పెద్దరెడ్ల మాణిక్యం, పెద్దిరెడ్డి జగన్‌, గొంపా అప్పల నాయుడు, గ్రామస్తులు పాల్గొన్నారు.

➡️