పెదనందిపాడులో అమరావతి రైతుల ప్రచారం

 పెదనందిపాడు రూరల్‌: మూడు రాజధానులు పేరుతో అమరావతిని ముక్కలు చేయాలని చూసిన వారికి ఓట్లు వేయొద్దని. సోమవారం సాయం త్రం అమరావతి ప్రాంతం నుండి పెదనందిపాడు వచ్చిన పలువురు మహిళా రైతులు ఓటర్లను అభ్యర్థించారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పత్తిపాడు అభ్యర్థి రామాంజనేయులను గుంటూరు పార్లమెంట్‌ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖరులను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వ హించారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపిలు నర్రా బాలకృష్ణ , ముద్దన నగరాజకుమారి, ముద్దన రాఘవయ్య, పోపూరి లక్ష్మీ నారాయణ, పార్టీ అభిమానులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️