చుక్కా చంద్రపాల్‌ను గెలిపించాలని ప్రచారం

May 3,2024 22:30

కరపత్రం ఇస్తున్న అభ్యర్థి చంద్రపాల్‌
ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ :
దేశ అభివృద్ధి కాంగ్రెస్‌పార్టీ తోనే సాధ్యమని ఇండియా వేదిక బలపరిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి చుక్కా చంద్రపాల్‌ అన్నారు. సత్తెనపల్లి పట్టణంలోని నిర్మలానగర్‌, అచ్చెంపేట రోడ్డు, అంబేద్కర్‌ కాలనీ, ఫణిదం సోసైటీ ఏరియా ప్రాంతాల్లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. మతతత్వ, కులతత్వ పార్టీలకు ఓటేస్తే అభివృద్ధి జరగదన్నారు. కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షులు దాసరి జ్ఞాన్‌ రాజ్‌పాల్‌ మాట్లాడుతూ రైతులను, ముస్లిములను, క్రైస్తవులపై దాడులు చేయిస్తూ దేశ ఆర్థిక పరిస్థితిని కాకావికలం చేసిన బిజెపి, దాని మిత్ర పార్టీలను ఓడించాలని విజ్ఞప్తి చేశారు. సిపిఎం మండల కార్యదర్శి పి.మహేష్‌ మాట్లాడుతూ సత్తెనపల్లి ఎమ్మెల్యేగా చుక్కా చంద్రపాల్‌ను, నరసరావుపేట ఎంపీగా అలెగ్జాండర్‌ సుధాకర్‌ను గెలిపించాలని కోరారు. ఇంటింటికీ వెళఙ్ల కరపత్రాలిచ్చి ఓట్లు అభ్యర్థి:చారు. సిపిఎం నాయకులు కె.శివదుర్గారావు కాంగ్రెస్‌ నాయకులు కె.ఆనంద్‌, ఆసిఫ్‌, జె.శేఖర్‌, ఎస్‌.మోహన్‌రావు పాల్గొన్నారు.

➡️