కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను గెలిపించుకోవాలి

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌.నరసింహారావు

మంగళగిరి: ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో శాసనసభ, పార్లమెంట్‌ స్థానాలకు పోటీ చేస్తున్న కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను గెలిపించుకోవడానికి కార్మిక వర్గం కృషి చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.నరసింహారావు పిలుపు నిచ్చారు. బుధవారం మంగళగిరి సిఐటియు కార్యాలయంలో భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం సమావేశం జరిగింది. ఈ సమా వేశానికి టి.శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. నరసింహారావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇసుక లేకపోవడం కారణంగా 30 లక్షల మంది కార్మికులు పని లేక ఉపాధి కోల్పోయారని విమర్శించారు. అవినీతిపరుల పని పడతానని చెప్పి ఈ ఐదేళ్లలో ఎవరిని అరెస్ట్‌ చేయలేదని అన్నారు. ఇసుక లేకపోవడం వలన కార్మిక వర్గం అనేక ఇబ్బందులు పడిందని విమర్శించారు. కార్మిక వర్గానికి నిరంతరం అండగా ఉండే సిపిఎం అభ్యర్థి జొన్న శివశంకరరావును మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నుకోవాలని కోరారు. గుంటూరు పార్లమెంట్‌ స్థానానికి జంగాల అజరు కుమార్‌కు ఓటేసి గెలిపించాలని కోరారు. చట్ట సభలలో కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధుల సంఖ్య పెరిగితే కార్మిక వర్గం సమస్యలు పరి ష్కారమవుతాయని అన్నారు. సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. సమావేశంలో భవన్‌ నిర్మాణరంగం కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి డి.లక్ష్మీనారాయణ, సిఐటియు నాయకులు ఎస్‌ ఎస్‌ చంగయ్య, వై.కమలాకర్‌, భావన నిర్మాణ రంగ కార్మిక సంఘం నాయకులు షేక్‌ జానీ బాషా, ఎన్‌ వెంకయ్య, ఎం శివారెడ్డి, నారయ్య, ఎం.వెంకటేశ్వర్లు, ఏ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️