నల్లమిల్లిలో క్యాసో (కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌)

ప్రజాశక్తి అమలాపురం రూరల్‌ (కోనసీమ) : జిల్లా ఎస్పీ శ్రీధర్‌ కుమార్‌ ఆదేశాల మేరకు అమలాపురం డి.ఎస్‌.పి ఎం మహేశ్వరరావు పర్యవేక్షణలో అమలాపురం రూరల్‌ సీఐ పి. వీరబాబు ఆధ్వర్యంలో ఎస్సై శేఖర్‌ బాబు బుధవారం నల్లమిల్లిలోని రాజీవ్‌ గఅహకల్ప సముదాయంలో క్యాసో(కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌) నిర్వహించారు. ఇందులో భాగంగా అనుమానాస్పద వ్యక్తులను విచారించారు. చట్ట విరుద్ధమైన వాటిని పరిశీలించారు. సరైన పత్రాలు లేని 10 బైకులను సీజ్‌ చేశారు. ఎలక్షన్‌ కౌంటింగ్‌ కు సంబంధించి ప్రజలు ఎవరూ కూడా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయకూడదని, ఎటువంటి గొడవలకు వెళ్ళకూడదని ఎస్‌ఐ శేఖర్‌ బాబు హెచ్చరించారు. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న దానికి సంబంధించిన వారి మీద కఠినమైన, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

➡️