గ్రామాల్లో జనసైనికుల సంబరాలు

Jun 19,2024 15:43 #Celebrations, #soldiers, #villages

ప్రజాశక్తి-శంఖవరం (కాకినాడ) : రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కల్యాణ్‌ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఆయా గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో బుధవారం సంబరాలు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఈరోజు శంఖవరం మండలంలోని నెల్లిపూడి గ్రామంలో సచివాలయం వద్ద జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడు తలపంటి బుజ్జి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఫోటోకి పూలమాలవేసి కేక్‌ కట్‌ చేశారు. ముఖ్య అతిధిగా పార్టీ జిల్లా ప్రోగ్రామింగ్‌ కమిటీ సభ్యులు కరణం సుబ్రహ్మణ్యం పాల్గన్న ఈ కార్యక్రమంలో శంఖవరం మండల అధ్యక్షుడు గాబు సుభాష్‌, పార్టీ నేతలు కీర్తి కుమార్‌, పోసిన శ్రీను, వీరబాబు, అధిక సంఖ్యలో జన సైనికులు, టిడిపి, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️