ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

May 13,2024 20:17 #Kurnool, #poling

ప్రజాశక్తి – మంత్రాలయం : అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం మంత్రాలయం నియోజకవర్గంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్రతీర్థులు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలనాగిరెడ్డి, టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేంద్ర రెడ్డి, కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పిఎస్ మురళి కృష్ణ రాజు టిటిడి పాలకమండలి సభ్యులు వై సీతారామిరెడ్డి మంత్రాలయం మండల అధ్యక్షులు వై. గిరిజమ్మ యువనేత వై. ధరణీధర్ రెడ్డితో పాటు పలువురు తమ ఓటును సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. పీఠాధిపతులు స్థానిక సంత మార్కెట్ వద్ద ఉన్న ప్రాధమిక పాఠశాలలో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోగా వై. బాలనాగిరెడ్డి తుంగభద్ర గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తమ ఓటును వేసి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేంద్ర మాధవరం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఆయన ఓటు వేసి అభివాదం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పిఎస్ మురళి కృష్ణ రాజు మండల కేంద్రంలోని కోసిగిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. టిటిడి పాలకమండలి సభ్యులు వై సీతారామిరెడ్డి, మండల అధ్యక్షులు వై. గిరిజమ్మ యువనేత వై. ధరణీధర్ రాంపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తమ ఓటును వేసి ఓటర్లకు నమస్కరించి ముందుకు సాగారు. వైసిపి మండల అధ్యక్షులు భీమిరెడ్డి తన సతీమణి రాజేశ్వరి గారితో కలిసి 52 బసాపురంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

➡️