9న చంద్రబాబు సభ జయప్రదం చేయండి

May 6,2024 20:56

ప్రజాశక్తి- చీపురుపల్లి : ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ఈ నెల 9న పాల్గొనున్న ప్రజాగళం భారీ బహిరంగసభను విజయవంత చేయాలని విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జి కిమిడి నాగార్జున అన్నారు. చీపురుపల్లిలోని విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారిలో మండల పరిషత్‌ కార్యాలయం ఎదురుగా ఎన్‌టిఆర్‌ విగ్రహం వద్ద సాయంత్రం 4గంటలకు ఏర్పాటు చేయనున్న బహిరంగ సభ స్థలాన్ని ఆయన పార్టీ ఉత్తరాంధ్ర ఇన్చార్జ్‌ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి సోమవారం పరిశీలించారు. సభ ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ఆంజనేయపురంలో హెలిపాడ్‌ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. చంద్రబాబు సభకు నియోజవర్గ పరిధిలోని నాలుగు మండలాల ప్రజలు, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, పార్టీ శ్రేణులు భారీగా తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రౌతు కామునాయుడు, దన్నాన రామ చంద్రుడు, మహంతి అప్పలనాయుడు, సనపతి శ్రీనివాస్‌, రౌతు నారాయణ రావు, దన్నాన సూరపనాయుడు, గంట్యాడ సత్యనారాయణ, మీసాల కాశీ తదితరులు పాల్గొన్నారు.

➡️