ఆగని గజదాడులు

Dec 20,2023 22:24

ప్రజాశక్తి- బంగారుపాళ్యంఅటవీశాఖ నిర్లక్ష్యంతో మండలంలో ఏనుగుల దాడులు ఆగడం లేదు. మంగళవారం రాత్రి వెలుతురుచేను పంచాయతీ సిజిఎఫ్‌ కాలనీ సమీపంలో ఏనుగుల గుంపు చెరకు, వరి పంటలపై దాడులు చేసి తిని తొక్కి నాశనం చేశాయి. ఒక సంవత్సర కాలంగా చెరకు పంటపై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయని రైతు చిన్నమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించే నష్టపరిహారం తమకు ఏమాత్రం సరిపోవడం లేదని, ఏనుగులను గ్రామాల్లోకి రాకుండా నియంత్రించేందుకు అటవీశాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టి వ్యవసాయాన్ని కొనసాగే విధంగా చూడాలని వేడుకున్నారు. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ఏనుగుల నియంత్రించేందుకు సరైన చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.

➡️