ఏనుగుల బీభత్సంశ్రీ పంట పొలాలు.. గ్రామాలపై దాడి తోటలు, ఇళ్లు ధ్వంసం భయాందోళనలో ప్రజలు కనిపించని అటవీశాఖ సిబ్బంది

ఏనుగుల బీభత్సంశ్రీ పంట పొలాలు.. గ్రామాలపై దాడి తోటలు, ఇళ్లు ధ్వంసం భయాందోళనలో ప్రజలు కనిపించని అటవీశాఖ సిబ్బంది

ఏనుగుల బీభత్సంశ్రీ పంట పొలాలు.. గ్రామాలపై దాడి తోటలు, ఇళ్లు ధ్వంసం భయాందోళనలో ప్రజలు కనిపించని అటవీశాఖ సిబ్బంది ప్రజాశక్తి-సోమల సోమల మండలం పేటూరు పంచాయతీ ఇర్లపల్లి గ్రామం పై ఏడు ఏనుగుల గుంపు దాడి చేసి ముగ్గురి ఇళ్లను, మూడు పూరి గుడిసెలను ధ్వంసం చేసింది. సమీపంలోని రైతుల పంట పొలాలలోని మామిడి చెట్ల కొమ్మలు విరిచి వేసి బీభత్సం సష్టించాయి. గ్రామస్తులు, రైతుల కథనం మేరకు…పేటూరు పంచాయతీ ఇర్లపల్లి గ్రామం పై శనివారం అర్ధరాత్రి ఏడు ఏనుగులు దాడి చేసి రాజమ్మ, ఎర్రబ్బ, సరకింటి ఊసన్న రైతులకు చెందిన పొలాల వద్ద నిర్మించుకున్న రేకుల షెడ్డును ధ్వంసం చేశాయి. ఆ సమయంలో వారు సమీపంలోని పూరి గుడిసెల్లో నిద్రిస్తూ ఉండగా ఏనుగుల బీభత్సం, ఘీంకార శబ్దాలతో మెలకువ వచ్చి గుడిసెల పైకి కూడా వస్తాయని చీకట్లోనే అక్కడి నుంచి పారిపోయారు. తరువాత పూరి గుడిసెలను కూడా ధ్వంసం చేసి గుడిసె లోపల ఉన్న దుస్తులు, వంట సామగ్రి, నిత్యావసర సరుకులను పూర్తిగా ధ్వంసం చేసి తొక్కి వేశాయి. రైతులు మేపుకుంటున్న మేకల దొడ్డిని ముళ్ల కంచెను పీకి వేసి చెల్లాచెదురు చేశాయి. ఏనుగుల బీభత్సానికి మేకలు కూడా అడవిలోకి పారి పోయాయని గ్రామస్తులు తెలిపారు. కనికల చెరువు ప్రాంతం నుండి వచ్చిన ఏడు ఏనుగుల మంద చిట్టి, సుబ్రహ్మణ్యం, ప్రసాద్‌ అనే రైతులకు చెందిన పంట పొలాల్లో స్వైర విహారం చేసి మామిడి మొక్కలను కొన్ని పెరికివేసి మరికొన్ని మొక్కల కొమ్మలను విరిచివేశాయని రైతులు తెలిపారు. ఇంత జరిగినా అటవీ శాఖ వారు సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించ లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల బెడద నుండి శాశ్వత పరిష్కారం ఎప్పుడు లభిస్తుందోనని ఈ ప్రాంత రైతులు, ప్రజలు, గ్రామస్తులు నిరీక్షిస్తున్నారు.

➡️