కార్మిక హక్కులు కాపాడాలిశ్రీ సీనియర్‌ సివిల్‌ జడ్జి కరుణకుమార్‌

Feb 9,2024 22:46
కార్మిక హక్కులు కాపాడాలిశ్రీ సీనియర్‌ సివిల్‌ జడ్జి కరుణకుమార్‌

ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌: నిర్బంధిత కార్మికుల హక్కులను కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి డాక్టర్‌ ఐ.కరుణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా కోర్టు న్యాయ సధన్‌ భవనం నందు వివిధ స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో కలసి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నిర్బంధిత కార్మిక వ్యవస్థ నిర్మూలన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ బంధించబడ్డ కార్మికుల హక్కులను కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు, జిల్లా న్యాయ సేవ అధికారి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని 13మండల న్యాయ సేవ అధికార సంస్థ నందు ఈ ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్మిక శాఖ సహాయ కార్మిక అధికారి జగదీష్‌ బాబు, వివిధ స్వచ్చంద సంస్థ ఎన్‌జిఓ ధనశేఖర్‌, శేషాద్రి, చెంగయ్య, కోదండపాని, ముని కష్ణ, భూపతి, మణి తదితరులు పాల్గొన్నారు.డెవలప్మెంట్‌ సొసైటీ సేవలు అభినందనీయం చిత్తూరు స్మార్ట్‌ సిటీ సేవలు అభినందనీయం అని సీనియర్‌ సివిల్‌ జడ్జి కరుణకుమార్‌ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభ గ్రాండ్‌ ఇన్‌లో చిత్తూరు స్మార్ట్‌ సిటీ డెవలప్మెంట్‌ సొసైటీ సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా సీనియర్‌ న్యాయమూర్తి కరుణ కుమార్‌ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభ్యులందరికీ ఐడి కార్డులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ సొంత లాభం కాకుండా నగర ప్రజల కోసం అడిగే తొమ్మిది అంశాలు చట్టబద్ధంగా, న్యాయంగా ప్రజలందరికీ కావాల్సిందే అన్నారు. నీళ్లు, విశాలమైన రోడ్లు ప్రజలకు, ప్రభుత్వాలు సమకూర్చాల్సిన ప్రాథమిక హక్కులు అని, అలాగే యూనివర్సిటీ మాత్రం మన స్థానిక కేంద్ర నాయకులు, కలెక్టర్‌ ద్వారా ఢిల్లీ లోని యూజీసీకి వెళ్లి సాధించుకోవాలన్నారు. ఈ సొసైటీలో ఎక్కువమంది రిటైర్‌ అయిన వారి కష్టపడే తత్వాన్ని చూస్తుంటే, నాకు కూడా ఇందులో సభ్యత్వం తీసుకోవాలని ఉత్సాహంగా ఉందన్నారు. సొసైటీకి తన వంతు సహాయ సహకారాలు అందిస్తాన్నారు. సొసైటి ప్రెసిడెంట్‌ తాండవ మూర్తి మాట్లాడుతూ నగర సమస్యలు తీరేంతవరకు సొసైటీ బందం పోరాడుతూనే ఉంటుందన్నారు. అలాగే చిత్తూరు ప్రజల కొరకు ”పరిష్కార వేదికని” కూడా ఏర్పాటు చేశామన్నారు. ప్రజా సమస్యలను తమ దష్టికి తెస్తే అధికారుల దగ్గరికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు, కార్యక్రమంలో కార్యదర్శి శివకుమార్‌, సత్య, ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు మల్లికార్జున రావు, కుమ్మరేషన్‌, ఆరని కవిత, శ్రీదేవి, సింగ్‌, వరదరాజులు, సాదిక్‌, మునీర్‌, నాగేంద్ర, పాల్గొన్నారు.

➡️