గహ రిజిస్ట్రేషన్‌ వేగవంతం చేయండి: జెసీ

Feb 9,2024 22:49
గహ రిజిస్ట్రేషన్‌ వేగవంతం చేయండి: జెసీ

ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌: గహాల రిజిస్ట్రేషన్‌ పనులు వేగవంతం చేయాలని, కుల గణన పూర్తి చేయాలని, ఈనెల 15న చిత్తూరులో జరగనున్న జాబ్‌ మేళాకు క్షేత్రస్థాయిలో ప్రాచుర్యం కల్పించాలని ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు ప్రొఫార్మాలను పూర్తి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం ఆర్డీవోలు, తహశీల్దారులు, ఎంపీడీవోలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జెసి మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న గహాల రిజిస్ట్రేషన్‌ కార్యక్రమం వేగవంతం చేయాలన్నారు. జిల్లాలోని పలు మండలాల్లో జరుగుతున్న రిజిస్ట్రేషన్‌ కార్యక్రమం గురించి ప్రశ్నించారు. ఈనెల 12తో కులగణన పూర్తికానున్నదని జిల్లాలో ఇప్పటివరకు 92శాతం పూర్తైందన్నారు. ఈనెల 15న చిత్తూరులోని విజ్ఞాన సుధా డిగ్రీ కళాశాలలో మెగా జాబ్‌ మేళాను నిర్వహించనున్నారని, పలు కంపెనీలకు సంబంధించి ఆరువేల పోస్టుల భర్తీకి సంబంధించి ఈ కార్యక్రమం జరగనుండగా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్‌ కమిషన్‌ పంపిన ప్రొఫార్మాలను సమాచారం పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా రిటర్నింగ్‌ అధికారులు అన్నీ పోలింగ్‌ స్టేషన్లను పరిశీలించాలని, పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి నెంబర్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈనెల 12 నుంచి శిక్షణ ఉంటుందని ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు శిక్షణలో పాల్గొనాల్సి ఉంటుందని సూచించారు. కార్యక్రమంలో డిఆర్‌ఓ పుల్లయ్య, స్కిల్‌ డెవలప్మెంట్‌ అధికారి గుణశేఖరరెడ్డి, డిపిఓ లక్ష్మి, డిపిఆర్‌ షణ్ముగ రామ్‌, పశుసంవర్ధక శాఖ అధికారి ప్రభాకర్‌, డిసీ ఆరోగ్యశ్రీ డాక్టర్‌ సుదర్శన్‌, ఎన్నికల డిటి త్యాగరాజు పాల్గొన్నారు.

➡️