తహశీల్దార్‌ హత్యను నిరసిస్తూ..కలెక్టరేట్‌ ఎదుట రెవెన్యూ ఉద్యోగుల నిరసన

తహశీల్దార్‌ హత్యను నిరసిస్తూ..కలెక్టరేట్‌ ఎదుట రెవెన్యూ ఉద్యోగుల నిరసన

తహశీల్దార్‌ హత్యను నిరసిస్తూ..కలెక్టరేట్‌ ఎదుట రెవెన్యూ ఉద్యోగుల నిరసన ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ఇంట్లో ఉన్న తహశీల్దార్‌ రమణయ్యను హత్య చేయడం దారుణమని జిల్లా రెవెన్యూ అసోసియేషన్‌ కార్యదర్శి ఎస్‌ఏ హుస్సేన్‌ అన్నారు. శనివారం ఉదయం విజయనగరం జిల్లా కొండేపల్లిలో తహశీల్దార్‌ రమణయ్యను హత్య చేయడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్‌ ఎదుట రెవెన్యూ ఉద్యోగులు నిరసన తెలిపారు. ప్రజలకు సేవలు అందించే అధికారులపై దాడులు దారుణమని నిందితులపై కఠిన చర్యలు తీసుకొని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. తహశీల్దార్లు వెంకటేష్‌, శేషగిరిరావు, పార్థసారథి, హెమద్రిరాజు, మధుసూదన్‌, సంపత్‌, తదితరులు పాల్గొన్నారు.శాంతిపురం: తహసీల్దార్‌ దారుణ హత్యకు నిరసనగా శనివారం రెవెన్యూ ఉద్యోగులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. విజయనగరం జిల్లా కొండేపల్లె తహశీల్దార్‌ రమణయ్యను కొందరు హత్య చేసిన ఘటనపై మండల రెవెన్యూ అధికారులు, సిబ్బంది తీవ్రంగా ఖండించారు. రమణయ్య హత్యకు కారకులైన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని, నిందితులపై తక్షణమే కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని, రమణయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. డిప్యూటీ తహశీల్దారు కౌలేష్‌, ఆర్‌ఐ మధు సూధన్‌, మండల సర్వేయర్‌ సద్దాం హుస్సేన్‌, సిబ్బంది వెంకటాచలపతి, కిషోర్‌, విఆర్‌ఓలు పాల్గొన్నారు.

➡️