రేపు కుప్పంకు సీఎం రాక

Jun 23,2024 23:56
రేపు కుప్పంకు సీఎం రాక

రేపు కుప్పంకు సీఎం రాకప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌: సీఎం చంద్రబాబు కుప్పంలో ఈ నెల 25, 26 తేదీల్లో పర్యటించనున్నట్లు కలెక్టర్‌ షన్మోహన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటన వివరాలు ఇలా..25న..మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు కుప్పం పిఈఎస్‌ మెడికల్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ చేరుకుంటారన్నారు. అనంతరం మధ్యాహ్నం 12.55గంటలకు శాంతిపురం మండలంలోని జల్లిగానిపల్లి, 1.35గంటలకు చిన్నారిదొడ్డి వద్ద ఉన్న హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ కాలువను పరిశీలించి ఆర్‌అండ్‌బి అతిథి గహం చేరుకుంటారు. అక్కడి నుంచి 3గంటలకు కుప్పం ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద బహిరంగ సభలో పాల్గొని తిరిగి ఆర్‌అండ్‌బి అతిథి గృహంకి చేరుకుంటారు. సాయంత్రం 4.40గంటలకు పార్టీ నేతలతో సమావేశమవుతారు. అక్కడే రాత్రి బస26న..బుధవారం కుప్పం ఆర్‌అండ్‌బి అతిథి గహంలో ఉదయం 10.30గంటలకు ప్రజల నుంచి వినతుల స్వీకరిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12గంటలకు కుప్పం పిఈఎస్‌ మెడికల్‌ కళాశాల సమీపంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కుప్పం నియోజకవర్గ అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారన్నారు. అనంతరం మధ్యాహ్నం 2.40గంటలకు పిఈఎస్‌ మెడికల్‌ కాలేజీ ఆడిటోరియంలో పార్టీ శ్రేణులతో సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4.10గంటలకు అక్కడే ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ నుంచి బెంగళూరు బయలుదేరి వెళతారని కలెక్టర్‌ తెలిపారు.

➡️