తుపాన్‌ ప్రభావిత ప్రాంతాలలో ఎంపీడీఓ పర్యటన

Dec 5,2023 22:02
తుపాన్‌ ప్రభావిత ప్రాంతాలలో ఎంపీడీఓ పర్యటన

ప్రజాశక్తి- వెదురుకుప్పం: మండలంలో తుపాన్‌ వల్ల కలిగిన సమస్యలను ఎంపీడీఓ ప్రేమ్‌ కుమార్‌ క్షేత్రస్థాయిలో పర్యటించి గుర్తించారు. మంగళవారం మాంబేడు ఏఏడబ్ల్యూలో ఆయన పర్యటించారు. వర్షాలకు పూర్తిగా నాని ఉరుస్తున్న ఇండ్లను గుర్తించి వారికి ప్రభుత్వం తరపున సహాయం అందేలా చూస్తానని, అర్హత కలిగిన వారికి పక్కా గహాలు మంజూరు చేయిస్తామని తెలిపారు. మండలంలోని నక్కలంపల్లి, పచ్చికాపల్లం గ్రామాల్లో పర్యటించి తుపాను పట్ల తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈవో అండ్‌ పిఆర్‌డి పురుషోత్తం, సచివాలయం డిడిఓ సుబ్రహ్మణ్యం, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, పాల్గొన్నారు.

➡️