నియంత జగన్‌ను గద్దె దింపడమే లక్ష్యం

నియంత జగన్‌ను గద్దె దింపడమే లక్ష్యం

నియంత జగన్‌ను గద్దె దింపడమే లక్ష్యంప్రజాశక్తి- తిరుపతి (మంగళం) : రాజశేఖర్‌రెడ్డి బిడ్డ తెలంగాణలో ఓ నియంతను గద్దె దించడం జరిగిందని, ఏపీలో ఉన్న మరో నియంత జగన్‌ అన్నను గద్దె దింపడం కోసం, ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్‌ఆర్‌ బిడ్డ కాంగ్రెస్‌ పార్టీలో చేరిందని పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిలారెడ్డి స్పష్టం చేశారు. ఆమె ఆదివారం చిత్తూరు జిల్లా నగరి బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతూ ప్రత్యేక హోదా పదేళ్ళు కావాలన్న చంద్రబాబు నాయుడు, తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని జగనన్న ప్రత్యక్షంగా ఒకరు, పరోక్షంగా మరొకరు రాష్ట్రంలో ఒక్క సీటు కూడా లేని బిజెపితో ట్రైయాంగిల్‌ లవ్‌లో వున్నాయని ఎద్దేవా చేశారు. జగనన్న నవరత్నాల పేరుతో ప్రజలకు మోసం చేశారాని, హోదాసాధన కోసం ఒక్క పోరాటం చేయలేదన్నారు. చంద్రబాబు నాయుడు రాజధాని ఆమరావతి అని సింగపూర్‌ చూపి గ్రాఫిక్స్‌లో చూపారని, జగన్‌ మూడు రాజధానులని ఒక్క రాజధాని కట్టారా అని ప్రశ్నించారు. హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని, మన బిడ్డల బ్రతుకులు బాగు పడుతాయన్నారు. హోదా సాధనలో వైసిపి,టిడిపిలు నోరు మెదపడం లేదన్నారు. రాజన్న పాలనలో రైతాంగం పండగని, జలయజ్ఞం రాజన కల అని అన్నారు. చివరికి ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు పోతూ మరణించారని గుర్తు చేశారు. అదే జగన్‌ పాలనలో రైతులకు గిట్టుబాటు ధరలేదని, పరిహారం అందడం లేదని, స్థిరీకరణ నిధి లేదన్నారు. అంతేకాకుండా ఫీజు రీయంబర్స్‌మెంట్‌ లేక నిరుపేద విద్యార్థులు విద్య దూరమైయ్యారని, జాబ్‌ క్యాలెండర్‌ లేదని, 30 వేల పోస్టులు వున్నా, మెగా డీఎస్సీ కన్నా దగా డీఎస్సీతో అదీ ఎన్నికల ముందు వెసారని ఆరోపించారు. గత 5 యేళ్లుగా ప్రజల ముందుకు, కనీసం ఎమ్మెల్యేలకు కనిపించని సీఎం ఎన్నికలు వస్తున్నాయని సిద్ధం అంటూ మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకే వస్తున్నారని విమర్శించారు. ఇలాంటి దగా ముఖ్యమంత్రి అవసరమా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మించారా..? హోదా సాధించారా..? బిడ్డల బాగు కోసం ప్రాజెక్టు సాధించారా..? అవేవీ చేయకుండా మళ్లీ ఎన్నికల ముందు మూటలతో వస్తున్నారని అన్నారు. మూటల డబ్బు మీదే, డబ్బు తీసుకుని మేలు చేసె వారికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. జగనన్న మద్యం బ్రాండ్లతో ప్రత్యేక హోదా, రాజధాని సాధించారన్నారు. రాహుల్‌ గాంధీ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం హోదాపైనే అన్నారు. హోదా కోసం, మీ బిడ్డలు బాగు కోసం కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని, రాజన్న రాజ్యం సాధించాలని విజ్ఞప్తి చేశారు. బహిరంగ సభ ప్రారంభంలో నగరి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ‘ఎల్లార్కం వణక్కం, నాన్‌ యార్‌ తెరిమిల్లా..? రాజశేఖరరెడ్డి పొన్నూ’ అంటూ తమిళభాషలో ప్రారంభించి ఆకట్టుకున్నారు. రాజన్న బిడ్డపై సోషల్‌ మీడియాలో ఎకిలిగా మాట్లాడుతుంటే, పోస్టులు పెడుతుంటే అన్న జగన్‌ స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు. మీరా రాజన్న రాజ్యం సాధించేదని ప్రశ్నించారు. నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా నగిరికి ఏమీ చేయలేదని, ఆమె భర్త, అన్నదమ్ములు మంత్రులుగా చెలామణీ అవుతూ మైనింగ్‌, శాండ్‌ డోచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇది చాలదన్నట్టు లేఅవుట్లు వేసే వారి నుంచి ప్లాట్లు లేదా గిఫ్ట్లు ఇవ్వాలని, లేదంటే కన్ను పడిందంటే ప్లాట్లు మాయమైపోటాయన్నారు. ఒక మహిళగా అంగగన్వాడీ మహిళల సమస్యలు పరిష్కారం చేయడంలో చొరవ చూపకపోవడం విడ్డూరంగా వుందన్నారు. అలాగే పవర్‌ లూమ్‌ కార్మికులకు విద్యుత్‌ రాయితీ ఇప్పించి ఆదుకోలేదని గుర్తు చేశారు. తాను తెలంగాణలో పార్టీని మూసేసి ఏపీలో ఎదో సాధించాలని వచ్చారంటూ విమర్శించడం విడ్డూరంగా వుందన్నారు. తెలుగు దేశం పార్టీలో ఉన్నపుడు రాజశేఖరరెడ్డిని గుడ్డలూడదీసి కొడతామన్న మాటల్ని వైఎస్సార్‌ అభిమానులు మరిచిపోలేదని గుర్తు చేశారు. నోరు జారడం మానుకోవాలని మంత్రి రోజాకు హితవు పలికారు. కాగా నగరి ఓంశక్తి ఆలయం నుంచి బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సభలో మాజీ ఎంపీపీ రామచంద్రారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరగా ఆయనకు ఆమె కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. మాజీ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శులు బాబు, చిరంజీవి రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఢిల్లీ, కార్యదర్శి దేశయ్య,వేణుగోపాల్‌, కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాకేష్‌ రెడ్డి, పురుషోత్తంరెడ్డి, అల్లాబక్ష్‌, కుమార్‌, నటరాజ మొదలియార్‌, సుధాకర్‌ బాబు పాల్గొన్నారు.

➡️