నేల, నీరు జీవవైవిధ్యానికి ఎంతో అవసరం

Dec 5,2023 21:29
నేల, నీరు జీవవైవిధ్యానికి ఎంతో అవసరం

ఎస్వీ వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ ప్రపంచ మృత్తికా దినోత్సవ వేడుకలుప్రజాశక్తి-క్యాంపస్‌: జీవవైవిధ్యానికి నేల, నీరు ఎంతో అవసరం అని శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ జి.ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం కళాశాలలో ప్రపంచ మృత్తికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేట్‌ డీన్‌ మాట్లాడుతూ ప్రపంచ మృత్తికా దినోత్సవ థీమ్‌ ”సాయిల్‌ అండ్‌ వాటర్‌ : ఎ సోర్స్‌ ఆఫ్‌ లైఫ్‌” అని తెలిపి నేల, నీరు జీవవైవిద్యానికి,పంటలకు ఎంతో అవసరమైనవని, నేల ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యకరమైన పంటలను తద్వారా ఆరోగ్యకరమైన, పోషక విలువలు కలిగిన పంట ఉత్పత్తులను పొందగలమని సూచించారు. నేల ఆరోగ్యాన్ని, నీటిని సంరక్షించుకోవాలని తెలిపారు. మృత్తికా విభాగపు ఇంచార్జ్‌ హెడ్‌ డాక్టర్‌ జి.పి.లీలావతి మాట్లాడుతూ సుస్థిర నేల యాజమాన్యం వలన నేలసారం, ఆరోగ్యం, వ్యవసాయానికి నీటి లభ్యత పెరుగుతుందని, వాతావరణంలో జరిగే మార్పులను తగ్గించవచ్చని తెలిపారు. అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ విభాగపు హెడ్‌ డాక్టర్‌ ఎం.వి.రమణ మాట్లాడుతూ నేల పరిరక్షణ వలన కలిగే ఉపయోగాలు గురించి వివరించారు. కీటక విభాగపు హెడ్‌ డాక్టర్‌ కె.మంజుల సేంద్రీయ వ్యవసాయం వలన నేల సారవంతాన్ని, రైతు నేస్తాలైన వానపాముల సంఖ్యను మెరుగుపర చవచ్చు అని వివరించారు. వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు కళాశాల అసోసియేట్‌ డీన్‌ బహుమతులను ప్రదానం చేశారు.మొక్కలు నాటి.. ఆవశ్యకత చాటి చెప్పిప్రపంచ నేల దినోత్సవం సందర్బంగా ఎస్వీ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ సి.ప్రకాశ్‌బాబు ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సిసి విభాగాల సహకారంతో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ”నేల, నీరే జీవరాశి అంతటికీ జీవనాధారం’ అని, మానవాళికి అత్యధిక ఆహారాన్ని అందిస్తున్న నేలను పరిరక్షించుకోవాలని, నీటిని పొదుపుగా వాడి నీటి సంరక్షణా యాజమాన్య పద్ధతుల ద్వారా భావితరాలకు నీటిని అందించాలని పిలుప ునిచ్చారు. కార్యక్రమంలో అధ్యాపకులు పి.ప్రియ వర్ధన్‌బాబు, వై.గంగాధర్‌ రావు, కె.కృష్ణకిశోర్‌, పి.రవికుమార్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️