పూతలపట్టు ఆశావహుల్లో హీటు

Mar 8,2024 22:33
పూతలపట్టు ఆశావహుల్లో హీటు

శ్రీ అభ్యర్థి ఎవరనేదానిపై సందిగ్ధత శ్రీ తెరమీదకు పలు ఆశావహుల పేర్లుశ్రీ ధీమాగా నియోజవర్గంలో ప్రచారం చేస్తున్న ప్రస్తుత ఇన్‌ఛార్జ్‌శ్రీ మలి దశ జాబితా కోసం అంతా ఎదురుచూపుప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: పూతలపట్టు నియోజకవర్గ స్థానంలో గెలుపునకు అభ్యర్థి విషయంగా టీడీపీ అధిష్టానం ఆచీతూచీ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల విభజన అనంతరం ఒక్కసారికూడా అక్కడ గెలవకపోవడంతో ఈ దఫా ఆ స్థానాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవలనే వ్యూహాల్లో అధినేత చంద్రబాబు ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఆశావహుల పేర్లను పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలో అభ్యర్థి ఎవరైతే విజయావకాశాలు ఉన్నాయనే సంపూర్ణ సర్వే రిపోర్ట్‌ను చంద్రబాబు తెప్పించుకొని పరిశీలిస్తున్నట్లు టీడీపీ నేతల్లో టాక్‌ నడుస్తోంది.విభజనానంతరం వరుస పరాజయాలు..నియోజకవర్గాల పునర్విభజనానంతంరం 2009లో కాంగ్రెస్‌ పార్టీ, ఆ తరువాత 2014, 2019లో వైసీపీ అభ్యర్థులు పూతలపట్టులో విజయాలు సాధించారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైన టీడీపీ అభ్యర్థి లలితకుమారి ఎన్నికల అనంతరం ఆమె పార్టీకి రాజీనామా చేసి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.ధీమాగా ప్రచారంలో ప్రస్తుత ఇన్‌ఛార్జ్‌.. ఓ మీడియా సంస్థలో జర్నలిస్టుగా పనిచేస్తున్న డాక్టర్‌ కలికిరి మురళిమోహన్‌ను టీడీపీ పూతలపట్టు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. కాగా పూతలపట్టులో జరిగిన ఓ సభలో చంద్రబాబు మురళిమోహన్‌ని ఆశీర్వదించాలని ప్రకటించినప్పటికీ తొలిజాబితాలో ఆయన పేరు రాలేదు. దీంతో ఆ స్థానంపై ఒకింత సందిగ్ధత నెలకొంది. కానీ తమకే సీటు కేటాయించారంటూ మురళీమోహన్‌ ధీమాగా నియోజకవర్గంలో పర్యటిస్తూ తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.ఆశావహుల్లో టెన్షన్‌.. టెన్షన్‌.. ఎన్నికల నోటిఫికేషన్‌ సమయం సమీపిస్తున్న కొద్దీ ఆశావహుల్లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఎట్టి పరిస్థితిల్లో తమ సీటు కేటాయిం చాలంటూ ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నట్లు సమా చారం. కాగా మాజీ మంత్రి గల్లా అరుణకుమారి శిష్యుడిగా పేరు ఉన్న యువ పారిశ్రామికవేత్త ముత్తు అలియాస్‌ పాకాల ముద్దుకృష్ణ, ప్రముఖ సినీనటుడు ఐరాల మండలం చెందిన సప్తగిరి ప్రసాద్‌, అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. అలాగే 2009లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్‌ రవి ఈ దఫా టిడిపి అభ్యర్థిగా నియోజకవర్గంలో పోటీచేయాలని తన వంతు ప్రయత్నాలు సాగిస్తు న్నారని తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌లను కలిసినట్లు సమాచారం. మలిజాబితాపై ఎదురుచూపు.. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాయి. అందులో పూతలపట్టు నియోజకవర్గ అభ్యర్థి పేరు ప్రకటించలేదు. దీంతో ఆశావహుల్లో ఒకింత టెన్షన్‌ కనిపిస్తోంది. మలిజాబితాలోనైనా తమ పేరు వస్తుం దేమోనని ఎదురుచూస్తున్నారు. అయినా ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు.

➡️