ప్రకతి వ్యవసాయ పంటలతో ఆరోగ్యం

Dec 15,2023 22:48
ప్రకతి వ్యవసాయ పంటలతో ఆరోగ్యం

జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు ప్రజాశక్తి-చిత్తూరు: ప్రకతి వ్యవసాయం ద్వారా ప్రజలు ఆరోగ్యవంతంగా జీవించేందుకు, జీవరాశులు మనుగడ సాధించేందుకు వీలుంటుందని జడ్పి చైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం పాలసముద్రం మండల కేంద్రంలో వ్యవసాయ సలహా మండలి సమావేశం రైతు చంద్రశేఖర్‌ రాజుకు చెందిన 35 ఎకరాల ప్రకతి వ్యవసాయ క్షేత్రంను ఎంపి రెడ్డెప్ప, జేసి పి.శ్రీనివాసులు, ఇతర సలహా మండలి సభ్యులు, అధికారులతో కలిసి జెడ్‌ పి ఛైర్మన్‌ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పశువుల పేడతో చేసిన ధూపంను, ఘిర్‌ జాతికి చెందిన పశువులను, పకతి వ్యవసాయంతో పెంచుతున్న వివిధ రకాల మొక్కలను పరిశీలించారు. జెడ్పి ఛైర్మన్‌ మాట్లాడుతూ జీవ వైవిధ్య కారకాలు ప్రకతి వ్యవసాయంలో వుంటాయని, ప్రకతికి కాపాడుకోవలసిన అవసరం ఉందన్నారు. ప్రకతి పరంగా జీవ వైవిధ్యాన్ని కాపాడుతున్న విధానంను వారు పరిశీలించారు. చిత్తూరు ఎంపీ ఎన్‌. రెడ్డప్ప మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ లాభసాటి వ్యవసాయంనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నదన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన అన్ని సలహాలు, సూచనలు అందిస్తూ ఆధునిక వ్యవసాయ సాగు పద్ధతులను రైతులకు తెలియజేయడం జరుగుతున్నదన్నారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి. శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రకతి వ్యవసాయం ఉత్పత్తులతో ఆరోగ్యంగా జీవించవచ్చునని తెలిపారు. ప్రకతి వ్యవసాయ విధానం పట్ల రైతులకు అవగాహన కల్పించడం జరుగుతోందని, ప్రకతి వ్యవసాయ ఉత్పత్తులకు స్థానికంగా మంచి డిమాండ్‌ ఉన్నదని, తద్వారా ఉత్పత్తులకు మంచి మార్కెట్‌ ఉన్నదని తెలిపారు. ప్రకతి వ్యవసాయ ఉత్పత్తులను పరిశీలించి మార్కెటింగ్‌ సౌకర్యం గురించి రైతును అడిగి తెలుసుకున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన జీవ వైవిధ్య ప్రేమికులు ఈ ప్రాంతానికి వస్తుంటారని రైతు తెలిపారు. ఈ సమావేశంలో డ్వామా పిడి గంగా భవానీ, జిల్లా వ్యవసాయ,ఉద్యానవన పశుసంవర్ధక, పట్టు పరిశ్రమ శాఖలకు సంబంధించిన అధికారులు మురళీకష్ణ మధుసూదన్‌ రెడ్డి డాక్టర్‌ ప్రభాకర్‌,శోభారాణి, సంబంధిత జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

➡️