మరమ్మతులకు నోచని రహదారి- దశాబ్దాలు గడిచినా మారని దారి- వాహన చోదకులు, రైతులకు ఇక్కట్లు

మరమ్మతులకు నోచని రహదారి- దశాబ్దాలు గడిచినా మారని దారి- వాహన చోదకులు, రైతులకు ఇక్కట్లు

మరమ్మతులకు నోచని రహదారి- దశాబ్దాలు గడిచినా మారని దారి- వాహన చోదకులు, రైతులకు ఇక్కట్లుప్రజాశక్తి- గంగవరం: మండల పరిధిలోని నాలుగవ జాతీయ రహదారి నుండి కీలపల్లి బాలేపల్లి మీదుగా పుంగునూరు- బైరెడ్డిపల్లి రహదారిని కలిపే రహదారి దశాబ్దాలైన మరమ్మతులు నోచుకోకపోవడంతో ఈ గ్రామాల రైతులు, ప్రజలు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత ప్రభుత్వం టిడిపి హయాంలో ఈ దారికి నాలుగు కోట్ల 90 లక్షల రూపాయల నిధుల మంజూరయ్యాయి. మట్టి పనులు, కంకర నింపి అలాగే వదిలేయడంతో రైతులు పండించిన పంటలు మార్కెట్‌ కి తీసుకు వెళ్లడానికి, ఈ గ్రామాల నుండి రహదారులకు వెళ్లే వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత ప్రభుత్వంలో మంజూరైన రహదారి కావడంతో అప్పటి కాంట్రాక్టర్లకు బిల్లులు అందకపోవడంతో వారు పనులను అర్థాంతరంగా వదిలిపెట్టి వెళ్లిపోయారని, అనేకసార్లు ప్రస్తుత ప్రజా ప్రతినిధులు, అధికారులకు లిఖిత పూర్వకంగా సమాచారం అందించినా పట్టించుకున్న పాపాన పోలేదని పేర్కొంటున్నారు. ‘గడప గడప వైయస్సార్‌’లో భాగంగా ఈ గ్రామాలకు వచ్చిన ఎమ్మెల్యేలు సైతం దీన్ని పట్టించుకోలేదని ముఖ్యంగా పాఠశాలలకు, కళాశాలకు వెళ్లి విద్యార్థులకు, ఇతర ప్రాంతాలలో బతుకు తెరువు కోసం వెళ్లే కూలీలు, చిరు ఉద్యోగులు రాత్రి వేళల్లో జాతీయ రహదారి నుండి రావడానికి నరకం అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా రోడ్డుకు మరమ్మతులు చేసి తమ గ్రామాలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతు న్నారు. ఈ గ్రామంలో గతంలో ఇద్దరు మండలాధ్యక్షులుగా పదవు లు చేపట్టారు. అయినా ఈ రహ దారి పూర్తి కాలేదు. అసంపూర్తిగా వుండ డంతో ప్రజలు, రైతులు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బం దులు పడు తున్నారు. నాయకులు, అధికారులు స్పందించి రోడ్డును పూర్తి చేసి స్థానికులకు మేలు చేయాలని పలువురు కోరు తున్నారు.

➡️