రిజిస్ట్రార్‌ ఆఫీసులో మహిళ ఆత్మహత్యాయత్నం

Dec 27,2023 22:15

ప్రజాశక్తి- కుప్పం: పట్టణంలోని రిజిస్ట్రారు కార్యాలయంలో శాంతిపురం మండలం చిన్నూరు గ్రామానికి చెందిన రత్నమ్మ అనే మహిళ ఆత్మహత్యకు యత్నించిన సంఘటన స్థానికంగా కలవరం రేపింది. ఈ సందర్భంగా బాధిత మహిళ మాట్లాడుతూ కుప్పం పట్టణం పైబాట ప్రాంతానికి చెందిన శివరాం ప్రసాద్‌తో పెద్దలు ఏడు సంవత్సరాలకు ముందు తనకు వివాహం చేశారని తెలిపారు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారని, కుటుంబకలహాల కారణంగా గత కొంతకాలంగా వేరుగా ఉన్నట్టు తెలిపారు. ఈ క్రమంలో తన భర్త వేరొక వివాహం చేసుకొని తనకు తన పిల్లలకు అన్యాయం చేశారని వాపోయారు. అంతేకాక భర్తకు ఉన్న ఆస్తిని తన రెండవ భార్య పేరున మార్పు చేయడానికి ప్రయత్నం చేశారని, విషయం తెలిసి కుప్పం రిజిస్ట్రారు కార్యాలయానికి చేరుకున్న తను సదరు ఆస్తి రిజిస్ట్రేషన్‌ చేస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టు తెలిపారు. తనకు తన పిల్లలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.

➡️