వేగంగా రాజకీయ సమీకరణం- హాట్‌టాఫిక్‌గా ‘చిత్తూరు’- జనసేనానిని కలిసిన ఎమ్మెల్యే శ్రీనివాసులు

వేగంగా రాజకీయ సమీకరణం- హాట్‌టాఫిక్‌గా 'చిత్తూరు'- జనసేనానిని కలిసిన ఎమ్మెల్యే శ్రీనివాసులు

వేగంగా రాజకీయ సమీకరణం- హాట్‌టాఫిక్‌గా ‘చిత్తూరు’- జనసేనానిని కలిసిన ఎమ్మెల్యే శ్రీనివాసులుప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌: మరో మారు తన ఆధిపత్యాని నిరూపించుకొనేలా అధికార వైసిపి చావో రేవో తేల్చుకునేందుకు, ప్రతిపక్ష టిడిపి 2024 ఎన్నికలను ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. ప్రతి అసెంబ్లీ స్థానంలో గెలుపు కీలకం కావడంతో ఇరు పార్టీలు అర్థ, అంగబలం ఉన్న అభ్యర్థులను ఎన్నికల బరిలోదింపుతున్నాయి. వైనాట్‌ 175 అంటూ జగన్‌మోహ్మన్‌రెడ్డి ఐప్యాక్‌ సర్వే పేరుతో సిట్టింగ్‌ ఎంఎల్‌ఏ మార్పునకు పూనుకోవడంతో చిత్తూరు జిల్లాలో ముగ్గురు సిట్టింగ్‌ ఎంఎల్‌ఏలు పార్టీ ధిక్కార స్వరం బలంగా వినిపించారు. సత్యవేడు, చిత్తూరు ఎంఎల్‌ఏలు పార్టీని విడటం పూతలపట్టు ఎంఎల్‌ఏ ఎంఎస్‌ బాబు పార్టీపై ఆరోపణలు చేశారు. జీడి నెల్లూరు స్థానం డిప్యూటీ సిఎం నారాయణ స్వామిని కాదని నారాయణ స్వామి కుమారైకు టికెట్‌ కన్ఫార్మ్‌ చేసింది. హాట్‌టాఫిక్‌ గా చిత్తూరు ఎన్నడూ లేని విధంగా చిత్తూరు అసెంబ్లీ స్థానం 2024 ఎన్నికల్లో హాట్‌టాఫిక్‌గా మారుతోంది. అధికార, ప్రతిపక్షం ఆర్థికంగా బలమైన అభ్యర్థులు ఎంసి విజయానందరెడ్డి, గురుజాల జగన్మోహన్‌ను అసెంబ్లీ బరిలో నిలిపింది. అధికార పార్టీ అభ్యర్థి ప్రకటనలో ఆలస్యం చేయకుండా ప్రకటించినా ప్రతిపక్ష టీడీపీ ఆచీతూచి గురుజాలను ఖరారు చేసింది. ఇరు పార్టీల అభ్యర్థుల ప్రచార హోరుతో చిత్తూరు అసెంబ్లీ వేడెక్కుతోంది. ఎటు చూసినా భారీ హోర్డింగులు, కటౌట్లు దర్శనం ఇస్తున్నాయి. 35 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభం కలిగిన మాజీ ఎంఎల్‌ఏ సీకే బాబు టిడిపి అభ్యర్థికి మద్దతు పలికారు. సిట్టింగ్‌ ఎంఎల్‌ఏ ఆరణి శ్రీనివాసులు జనసేన తీర్థం పుచ్చుకోవడంతో చిత్తూరు అసెంబ్లీ హాట్‌టాఫిక్‌ మారింది. మారుతున్న సమీకరణలతో విజయం ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి. ఫ్యాను వీడి గ్లాస్‌ అందుకున్న ఆరణిచివరి వరకు తనకే టికెట్‌ అనుకున్న సిట్టింగ్‌ ఎంఎల్‌ఏని మార్చి విజయానందరెడ్డికి టికెట్‌ కేటాయించడం పట్ల ఎంఎల్‌ఏ అనుచరులు అధికార పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను దూరంగా వుంటున్న ఆరణి ఆదివారం హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను కలవడం గత కొంత కాలంగా పార్టీని వీడుతారనే అను మానాలకు తెరపడింది. మరో వైపు ఆరణి శ్రీనివాసులును పార్టీ నుండి తొలగిస్తున్నట్లు వైసిపి అధిష్టానం ప్రకటించినట్లు సమాచారం. ఈ ప్రభావం చిత్తూరు నగర పాలక సంస్థ పాలక వర్గంపై పడే అవకాశమున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చనడుస్తోంది. ఆరణి శ్రీనివాసులను బలపరిచే కార్పొరేటర్లు పార్టీని వీడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. జనసేనానిని కలిసిన జంగాలపల్లి అధికార పార్టీకి చెందిన చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు ఆదివారం హైదరాబాదులో జనసేన పవన్‌ కళ్యాణ్‌ తో సమావేశమయ్యారు. పవన్‌ కళ్యాణ్‌ జంగాలపల్లి శ్రీనివాసులును సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు. మంచి ముహూర్తం చూసుకొని రెండు, మూడు రోజుల్లో జనసేన లో చేరనున్నట్లు జంగాలపల్లి శ్రీనివాసులు తెలిపారు. అధికార వైసీపీకి చెందిన ముగ్గురు శాసనసభ్యులు జిల్లాలో చేజారినట్లు అయింది. సత్య వేడు శాసనసభ్యుడు ఆదిమూలం ఇప్పటికే టిడిపి కండువా కప్పుకున్నారు. పూతలపట్టు శాసనసభ్యుడు ఎమ్మెస్‌ బాబు అధిష్టానం మీద తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. వైసిపి దళితుల వ్యతిరేక పార్టీ అంటూ ఆరోపణలు చేశారు. జిల్లాలో రెడ్లు చెప్పినట్టుగానే నడుచుకున్నానని, అయినా వ్యతిరేకత ఏమిటని ప్రశ్నించారు. ఇప్పుడు జంగాలపల్లి శ్రీనివాసులు జనసేనలో చేరడానికి సిద్ధమయ్యారు.శ్రీనివాసులను తొలుత చిత్తూరు శాసనసభ అభ్యర్థిగా మంత్రుల బృందం ప్రకటించింది. చిత్తూరు టికెట్‌ తనకే ఖరారు అని అనుకున్న దశలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన విజయానంద రెడ్డికి టికెట్టు ఖరారు చేశారు. రాజ్యసభ టికెట్‌ ఇస్తానని జంగాలపల్లిని మభ్యపెట్టి, ఆ సీటును వేరే వారికి ఇచ్చారు. దీంతో అలక చెందిన జంగాలపల్లి శ్రీనివాసులు పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. అవమానాలు, అవహేళనలు ఎదుర్కొంటు వైసిపి లో కొనసాగడం మంచిది కాదని భావించారు. చిత్తూరు టిడిపి ఇప్పటికే తన అభ్యర్థిని ప్రకటించింది. దీంతో జంగాలపల్లి శ్రీనివాసులు జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. వెంటనే హైదరాబాద్‌ వెళ్లి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ను కలిశారు. ఆయన కూడా సాధారంగా పార్టీలోకి ఆహ్వానించడంతో, రెండు మూడు రోజుల్లో జంగాలపల్లి శ్రీనివాసులు జనసేన కండువాను కప్పుకోనున్నారు.

➡️