సందళ్లు.. సందళ్లే.!

Jan 6,2024 22:54
సందళ్లు.. సందళ్లే.!

– డైట్‌లో అట్టహాసంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు
– ద్రవిడ వర్సిటీలో ఘనంగా పొంగళ్లు
ప్రజాశక్తి-కార్వేటినగరం: పల్లెలకంటే ముందస్తుగానే విద్యాలయాలకు సంక్రాంతి వచ్చింది. తెలుగు సంప్రదాయాలను గుర్తు చేసేలా ఆయా సంస్థల్లో విద్యార్థుల మద్య సంబరాలు జరిపుతున్నారు. శనివారం సంక్రాంతిని పురస్కరించుకుని ముందస్తుగా సంభరాలను వైభవంగా నిర్వహించారు. ఈ సంధర్బంగా ఛాత్రోపాధ్యాయులు డైట్‌ ఆవరణాన్ని రంగు రంగుల రంగవల్లులతో సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే తెలుగు సంప్రదాయ ప్రకారం భోనాలు ఏర్పాటు చేసి షడ్రుచిలతో కూడిన వంటకాలు వండి అమ్మవారికి నైవేధ్యం సమర్పించారు. అనంతరం డీఈవొ(తిరుపతి) డైట్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శేఖర్‌ ఈ సంభరాల్లో పాల్గొని అధ్యాపకులకు ఛాత్రోపాధ్యాయులకు ప్రసాదాలను పంచిపెట్టి ఆనందంగా గడిపారు. ఏర్పాటు చేసిన భోగిమంటలు ఆకట్టుకున్నాయి. అనంతరం డైట్‌ ఆవరణంలో కోలాటాలు, కర్రబిళ్ల, కర్రసాము, నాలుగు స్తంబాల ఆట, గోళీలాట, బొంగరాలు, వైకుంఠపాళి వంటి ఆటలను చూపరులను ఎంతో ఆకట్టుకున్నారు. అలాగే ఓ విద్యార్థిని ప్రిన్సిపాల్‌కు శోది చెప్పడం ఆకట్టుకుంది. అదే విధంగా సంక్రాంతి సాంప్రదాయ ప్రకారం గోపూజ నిర్వహించారు. తెలుగు దనాన్ని ఉటిపడేలా తెలుగు, తమిళం ఛత్రోపాధ్యాయులు కలసి ఆడుకోవడం చూసిన ప్రిన్సిపాల్‌ ఇలాంటి అహల్లాద కరమైన వాతావరణంలో విధ్యనభ్యసించడం, పిల్లలయొక్క అద ష్టమని కొనియాడారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ సుబ్ర మణ్యం, అద్యాపకులు దేవప్రసాద్‌, చెంగల్రాజు, రెడ్డివెంకట రమణ, నాగరాజునాయక్‌, శ్రీనివాసులు, ప్రభాకర్‌, వ హమ దఫీ,నిర్మల,సునీత,అనీత, అలాగే కార్యాలయ సిబ్బంది. పలువురు పాల్గొన్నారు.ద్రవిడ వర్సిటీలో..ప్రజాశక్తి-గుడుపల్లి: ద్రవిడ విశ్వవిద్యాలయంలో అమ్మవారి గుడిలో సంక్రాంత్రి సంబరాలు నిర్వహించారు. విశ్వవిద్యా లయం తమిళ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఘనంగా పొంగళ్లు చేశారు. విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె.మధుజ్యోతి, రెక్టార్‌ ప్రొఫెసర్‌ అనురాధ, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఏకే.వేణుగోపాల్‌ రెడ్డి, అకాడమిక్‌ డిన్‌ ప్రొఫెసర్‌ డి.శ్రీనివాస్‌ కుమార్‌ పాల్గొన్నారు.

➡️