షార్ట్ సర్క్యూట్ తో మంటలు

Mar 8,2024 14:17 #Chittoor District

తప్పిన పెను ప్రమాదం

ప్రజాశక్తి-వి కోట : మండల కేంద్రమైన వీకోటలోని కేజి ఎఫ్ రోడ్డు లోని ఓ భవనంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. స్థానికుల కథనం మేరకు వివరాలు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలోని డి.ఆర్.కె. భవంతిలో శుక్రవారం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగసిపద్దాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు మంటలు పక్కనున్న భవంతులకి విస్తరించకుండా అదుపు చేసేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. వీకోటలో ఫైర్ ఇంజన్ అందుబాటులో లేకపోవడంతో పోలీసులు కుప్పం, పలమనేరు ఫైర్ స్టేషన్లకు సమాచారం అందించారు. శివరాత్రి పర్వదినం కావడంతో అందరూ ఇండ్లలో ఉండటంవల్ల మంటలు వ్యాపించిన విషయం తెలిసి భవనంలోని వారందరూ అప్రమత్తమయ్యారు దీనితో పెను ప్రమాదం తప్పింది. సంఘటనా స్థలాన్ని స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పరిశీలించారు.

➡️