మహిళ మృతిదేహానికి నివాళులర్పించిన టిడిపి నాయకులు

Feb 29,2024 11:13 #Chittoor District
TDP leaders paid tribute to the dead body of the woman

ప్రజాశక్తి-వెదురుకుప్పం( చిత్తూరు జిల్లా) : వెదురుకుప్పం మండలం కురివి కుప్పం హరిజనవాడకు చెందిన కే.వేణు భార్య అమరావతి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో వేలూరు సిఎంసి హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. విషయం తెలుసుకున్న టిడిపి నాయకులు గురువారం ఉదయం కురివి కుప్పంలో అమరావతి (24) మృతి దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డా.వి.ఎం.థామస్ తమ్ముడు వి.నిధి హాజరయ్యారు. ఆయన వెంట వెదురుకుప్పం మండల పార్టీ అధ్యక్షులు లోకనాథ్ రెడ్డి,టిడిపి మాజీ మండల అధ్యక్షులు & మాజీ ఎంపీటీసీ మోహన్ మురళి,మండల సీనియర్ నాయకులు నాదమునిరెడ్డి,మండల రైతు అధ్యక్షులు రాజారెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వరప్రసాద్, శంకర్ రాజేంద్ర చెల్లయ్య దదితరులు ఉన్నారు.

➡️