ఘనంగా ఓటర్ల దినోత్సవం

Jan 25,2024 11:53 #Chittoor District
voters day in vr puram

ప్రజాశక్తి-ఎస్ఆర్ పురం : జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎస్ఆర్ పురం మండల కేంద్రమైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు మండలవిద్యాధికారి అరుణాచలం రెడ్డి, తాసిల్దార్ బెన్ను రాజు ఆధ్వర్యంలో ఎస్ఆర్ పురం పోలీస్ స్టేషన్ నుండి పుల్లూరు క్రాస్ కూడలి వరకు ర్యాలీగా వచ్చి మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ లోకనాథ పిల్లై, ఏ ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఆర్ ఐ ప్రభాకర్, సర్వే ర్ మురళి రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, పాఠశాల సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

➡️