సచివాలయ ఉద్యోగికి భద్రత ఏది ?

Feb 15,2024 13:39 #Chittoor District

ప్రజాశక్తి – ఎస్ఆర్ పురం: ఎస్ఆర్ పురం మండల కేంద్రం సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ శశి కుమార్ పై దాడి చేసిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఆర్ పురం సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ శశి కుమార్ దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ సతీష్ కుమార్ మాట్లాడుతూ…. మంగళవారం సాయంత్రం విధులు నిర్వహిస్తున్న నన్ను హౌసింగ్ బిల్లు విషయంపై, ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు దాడి చేశారన్నారు.

ఇంజనీరింగ్ అసిస్టెంట్ సచివాలయ ఉద్యోగిపై దాడి చేసిన వ్యక్తుల పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఇంతవరకు స్పందించకపోవడం దారుణం. ఏమైనా లోపాయిక ఒప్పందం జరిగిందా? అందుకే నిర్లక్ష్యం వహిస్తున్నారా…? సచివాల సిబ్బందికి, స్థానిక గ్రామ ప్రజలకు పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సంబంధిత వ్యక్తులపై ఎందుకు కేసు నమోదు చేయడం లేదు. కేసును నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నారా?.ఒక సచివాలయం ఉద్యోగికి భద్రత లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి..? అని స్థానికులు వాపోతున్నారు.

➡️